జనవరి 11న ‘వెంకీ మామ’.....!

by సూర్య | Tue, Oct 15, 2019, 12:26 PM

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ఈ సినిమాని కొన్ని రోజుల క్రితం, సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు మేము వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఇంకా అధికారిక ధృవీకరణ జరగనప్పటికీ, మేకర్స్ ఈ తేదీనే తమ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలారోజుల నుండి ఊరిస్తూ వస్తున్న వెంకీ, చైతన్యల కాంబినేషన్ కావడంతో ‘వెంకీ మామ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

Latest News
 
త్రిష కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'విశ్వంభర' టీమ్ Sat, May 04, 2024, 03:11 PM
ముంబైలో భారీ షెడ్యూల్ ని స్టార్ట్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్' Sat, May 04, 2024, 03:08 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Sat, May 04, 2024, 03:02 PM
'గం గం గణేశ' లోని పిచ్చిగా నాచెసేవే సాంగ్ అవుట్ Sat, May 04, 2024, 02:58 PM
'ఆ ఒక్కటి అడక్కు' డే వన్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Sat, May 04, 2024, 02:55 PM