'ఆ ఒక్కటి అడక్కు' డే వన్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...!

by సూర్య | Sat, May 04, 2024, 02:55 PM

మల్లి అంకం దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా మే 3న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా విడుదలైన తొలి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 1.62 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నరేష్ కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో అరియానా మరియు హర్ష చెముడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM