నవంబర్‌ మొదటివారంలో "ఏడు చేపల కథ"

by సూర్య | Tue, Oct 15, 2019, 12:22 PM

టెంప్ట్‌ రవి (అభిషేక్‌రెడ్డి), భానుశ్రీ, ఆయేషాసింగ్‌, మేఘా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ఏడు చేపల కథ. ఎస్‌.జె.చైతన్య దర్శకత్వం వహించారు. రాకేష్‌రెడ్డి సమర్పణలో చరిత్ర సినిమా ఆర్ట్స్‌ పతాకంపై జీవీఎన్‌ శేఖర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్‌ మొదటివారంలో విడుదలకానుంది. కాగా సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా నిర్మాత శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రకథను ఏడాది కిందట శ్యామ్‌ చెప్పారు. ఇందులో యూత్‌కి ఉపయోగపడే చక్కటి సందేశం ఉంటుంది. పద్నాలుగు మంది అమ్మాయిలతో దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతోబాగా తెరకెక్కించారు. కథకు వాళ్లు ఎంతో అవసరం. ఇక టెంప్ట్‌ రవి వేరే షూటింగ్‌లో ఉండటం వల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. సునీల్‌ పాత్ర ఈ చిత్రంలో గగుర్పొడుస్తుంది. బిగ్‌బాస్‌ భానుశ్రీ, అక్షర, యషిక…ఇలా చాలా మంది తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇచ్చాం అని అన్నారు. దర్శకుడు శ్యామ్‌ మాట్లాడుతూ, చిన్న సినిమా లైఫ్‌ను నిర్ణయించేది టీజర్‌. అది విజయవంతమైతే సినిమా విజయం సాధించినట్లే. మా టీజర్‌ విడుదల కాగానే చాలామంది చాలా కామెంట్లు చేశారు. బూతు సినిమాలు తీసి డబ్బులు సంపాదిస్తున్నామని…కానీ అలాంటిదేమీ లేదు. ఈ టీజర్‌ ఇంతబాగా రావడానికి ప్రధాన కారణం టెంప్ట్‌ రవి. తన పాత్రలో చాలా ఫన్‌ ఉంటుంది. ఫ్యామిలీస్‌ కోసం కాకుండా కేవలం యూత్‌ను లక్ష్యంగా చేసుకుని తీసిన చిత్రమిది. అయితే బూతు సినిమా కాదు. మా తపన అంతా సినిమాలో కనిపిస్తుంది అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరభద్ర, ఇషిక, అనుపమ, చిత్ర నటీనటులు మేఘ, అయిషాసింగ్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.


 


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM