ఈ ప్రముఖ పాప్ సింగర్ ఇకలేరు

by సూర్య | Mon, Oct 14, 2019, 07:56 PM

తన అందంతో, పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ సుల్లీ (25) చనిపోయారు. కొంతకాలంగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నారట. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని సియోంగ్నామ్ ప్రాంతంలో సుల్లీ నివసిస్తుండేవారు. ఇటీవల ఆమె సైబర్ ట్రోలింగ్స్‌పై తన అభిప్రాయాలను వెల్లడించారు. అయితే ఆమె కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారట. భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం నుంచి సుల్లీ మేనేజర్ ఫోన్ చేస్తుంటే ఆమె లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆమె నివాసానికి వెళ్లి చూడగా సుల్లీ శవమై కనిపించారు. దాంతో వెంటనే ఆమె మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయారా? లేక డిప్రెషన్‌తో ఆరోగ్యం పాడై చనిపోయారా అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. సుల్లీ అసలు పేరు చాయ్ జిన్రీ. కానీ ఆమె సుల్లీ పేరుతో సౌత్ కొరియాలో ఫేమస్ అయిపోయారు. 2005లో 11 ఏళ్ల వయసులోనే సుల్లీ పాపులర్ అయిపోయారు. f(x) అనే ఐదుగురు సింగర్స్‌ ఉన్న గ్రూప్‌లో సుల్లీ ఒకరు. ఈ బ్యాండ్ నుంచి వచ్చిన పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. ఆ తర్వాత సుల్లీ సొంతంగా ఆల్బమ్స్ రూపొందించడం మొదలుపెట్టారు. అయితే సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్స్ ఎక్కువ అవుతుండడంతో సుల్లీ 2014లోనే పాటలు పాడటం మానేశారు. 2015 నుంచి కేవలం సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ 2018లో కొత్త పాటను రూపొందించారు. సుల్లీ డిప్రెషన్‌తో పాటు ప్యానిక్ డిజార్డర్‌తోనూ బాధపడుతుండేవారు. తనవారే తనను వదిలేసి వెళ్లిపోయారని. వారి వల్ల చాలా బాధపడ్డానని సుల్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుని ఏడ్చారు. తనను ఎవ్వరూ అర్థం చేసుకోరని బాధపడ్డారు. సుల్లీ మరణంతో సౌథ్ కొరియాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఫ్యాన్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. సుల్లీకి ఇండియాలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే పోస్ట్‌లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇందుకు కారణం సుల్లీ చూడటానికి బొమ్మలా అందంగా ఉండటమే. అయినవారందరూ దూరమైపోవడంతో సుల్లీ ఈ అఘాయిత్యానికి పాల్పడటం తమను కలచివేస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM