లేటెస్ట్ సైరా యూఎస్ కలెక్షన్స్

by సూర్య | Mon, Oct 14, 2019, 07:38 PM

సైరా వసూళ్ల పరంగా మరో మైలురాయిని చేరుకుంది. యూఎస్ లో $2.5 మిలియన్ మార్కు చేరుకొని అబ్బురపరిచింది. దీనిపై సైరా యూఎస్ విడుదల హక్కులను సొంతం చేసుకున్న స్నో ఫ్లేక్ సినిమాస్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ పీరియాడిక్ పేట్రియాటిక్ విజువల్ వండర్ రికార్డ్ వసూళ్లు సాధిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణా, ఉత్తరాంధ్ర ఏరియాలలో సైరా వసూళ్లు పటిష్టంగా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలలో సైరా లాభాలలోకి ప్రవేశించినట్లు సమాచారం.ఐతే యూఎస్ లో బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఇంకా సైరా చాలా వసూళ్లు సాధించాలి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ సరసన నయనతార, తమన్నా నటించిన ఈ చిత్రంలో అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. ఈ మూవీ కి సంగీతం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది అందించారు.

Latest News
 
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM