కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు

byసూర్య | Fri, Apr 26, 2024, 08:33 PM

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కాళ్లకు చక్రాలు కట్టుకొని ఓటరు దేవుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తిగా కాగా.. నేడు పరిశీలన ఉండనుంది. ఇక వరంగల్ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బబూ మెహన్ నామినేషన్ వేశారు. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించగా.. ఆయన ఆ పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు.


ఇదే విషయంపై ఆయన్ను వివరణ అడగ్గా.. ప్రజాశాంతి పార్టీలో చేరికపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను అసలు ప్రజాశాంతి పార్టీలో చేరనే లేదని చెప్పారు. బీజేపీ నుంచి బయటకు వచ్చాక.. కాఫీకి రావాలంటూ కేఏ పాల్ నుంచి పిలుపొచ్చిందని చెప్పారు. అలా ఆయన వద్దకు కాఫీకి వెళితే.. అనుహ్యంగా తన మెడలో కండువా కప్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారన్నారు. అయితే ఆ పార్టీలో తాను ఎలాంటి సభ్యత్వం తీసుకోలేదని.. తనకు కండువా కప్పిన రోజే ప్రజాశాంతి పార్టీకి టాటా చెప్పినట్లు వెల్లడించారు. వరంగల్‌లో పోటీ చేయాలని కొందరు అభిమానులు కోరటంతో తాను ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని అన్నారు.


కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం వరంగల్ స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశించినా.. బీజేపీ అధిష్ఠానం సముఖత వ్యక్తం చేయలేదు. దీంతో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన బాబూ మోహన్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కేఏ పాల్‌ను కలిసి ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. నామినేషన్ల చివరి రోజు ఆయన వరంగల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.


Latest News
 

ఢిల్లీ మద్యం పాలసీ కేసు....కవిత పిటిషన్‌ను రేపు విచారించనున్నకోర్టు Thu, May 09, 2024, 11:40 PM
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి Thu, May 09, 2024, 10:13 PM
రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది : సీఎం రేవంత్ Thu, May 09, 2024, 10:07 PM
మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM