వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా

byసూర్య | Tue, Apr 23, 2024, 10:51 PM

ప్రస్తుతం అబ్బాయిలకు ఒక్క పెళ్లి కావటమే కష్టంగా ఉంటే.. వీడు మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవటమే కాదు.. మరో అమ్మాయితో కూడా ప్రేమాయణం నడిపిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మూడో పెళ్లి కూతురి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుతో ఈ నిత్యపెళ్లికొడుకు బాగోతం బయటపడింది. వరంగల్‌లోని సుందరయ్యనగర్‌కు చెందిన రాజేష్ అనే యువకుడు.. హైదరాబాద్‌లో కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 2022న నగరంలోని చార్ బౌలీకి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు రాజేష్. కొన్ని రోజులు ఆమెతో ప్రేమాయణం నడిపిన రాజేష్.. ఆమెను మొదటి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత.. ఎక్కువ రోజులు కూడా ఆగకుండానే.. మళ్లీ అదే సంవత్సరం (2022) మేలో ఆంధ్రాకు చెందిన మరో యువతిని హైదరాబాద్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ 3 నెలల తర్వాత.. వరంగల్‌‌లోని సుందరయ్య నగర్‌కు వచ్చిన రాజేష్.. అదే ప్రాంతానికి చెందిన ఇంకో అమ్మాయితో ప్రేమాయణం సాగించాడు. ఆమెను 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఆర్య సమాజ్‌లో మూడో వివాహం చేసుకున్నాడు.


ఈ మూడు పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకున్నాడు. ముగ్గురిని వేర్వేరు చోట్ల అద్దెకు ఉంచాడు. ఈ వ్యవహారం అంతా బాగానే ఉండగా.. రాజేష్ ఇప్పుడు ఈ ముగ్గురిని కాదని ఇంకో యువతితో ప్రేమ అంటూ తిరుగుతుండటం గురించి తెలిసిన మూడో భార్య తల్లిదండ్రులు.. రాజేష్‌ను నిలదీశారు. దీంతో.. వాళ్ల కళ్లుగప్పి రాజేష్ పరారయ్యాడు. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందిచగా.. సంఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు మొదలుపెట్టారు. దీంతో.. ఈ మూడిండ్ల ముచ్చట బయటపడింది. ఎవరికి విడాకులు ఇవ్వకుండా తన కూతురిని మూడో పెళ్లి చేసుకున్న రాజేష్‌పై కఠిన చర్యలు తీసుకొని తన కూతురిని కాపాడాలని ఆ అమ్మాయి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఈ కామాంధుని నుంచి.. అమ్మాయిలను కాపాడాలంటున్నారు.


Latest News
 

సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి Thu, May 09, 2024, 03:58 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Thu, May 09, 2024, 03:53 PM
కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు మల్కాజిగిరిలో ఓటు హక్కు కూడా లేదు Thu, May 09, 2024, 03:50 PM
గోమాసకు మద్దతుగా ప్రచారం Thu, May 09, 2024, 03:44 PM
వంశీని పార్లమెంటుకు పంపండి.. Thu, May 09, 2024, 03:41 PM