యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు

byసూర్య | Tue, Apr 23, 2024, 08:59 PM

హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. నగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట అగ్ని ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి. ఫైర్ సెప్టీకి సంబంధించి ఎన్ని చర్యలు చేపట్టినా ప్రమాదాలు మాత్రం ఆగటం లేదు. తాజాగా.. హైదరాబాద్ యూసఫ్‌గూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే 'నాని కార్స్‌'లో గ్యారేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో గ్యారేజీలో మెుత్తం 20 కార్లు ఉండగా.. 16 కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి.


సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. పక్కనే నివాస భవనాలు ఉండటంతో మంటలు అంటుకోకుండా చర్యలు తీసుకున్నారు. మరో నాలుగు కార్లకు నిప్పంటుకోకుండా చర్యలు తీసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్ని మాపకశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది.


ఇక నాగర్ కర్నూలు జిల్లాలోనూ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఫుట్‌పాత్ పక్కనే ఉండే 5 దుకాణాలు అగ్ని ఆహుతయ్యాయి. దీంతో దుకాణ యజమానులు కన్నీటిపర్యంతమయ్యారు. రాత్రి సమయంలో ప్రమాదం జరగటంతో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేుసుకోలేదు.


Latest News
 

సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి Thu, May 09, 2024, 03:58 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Thu, May 09, 2024, 03:53 PM
కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు మల్కాజిగిరిలో ఓటు హక్కు కూడా లేదు Thu, May 09, 2024, 03:50 PM
గోమాసకు మద్దతుగా ప్రచారం Thu, May 09, 2024, 03:44 PM
వంశీని పార్లమెంటుకు పంపండి.. Thu, May 09, 2024, 03:41 PM