పెట్రోల్ బంకులో హల్ చల్ .. మద్యం మత్తులో ఇద్దరు ఆకతాయిలు

byసూర్య | Sun, Oct 27, 2024, 06:58 PM

మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఆకతాయిలు పెట్రోల్‌ బంకులో హల్ చల్  చేశారు. వాహనదారులు తమ వాహనాలకు పెట్రోల్ కొట్టించుకుంటూ ఉండగా తన వద్ద ఉన్న లైటర్‌ను వెలిగించాడుదీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన పెట్రోల్‌ బంక్‌ నిర్వహకులు మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. లేదంటే ఊహకందని విధ్వంసం చోటు చేసుకునేంది. ఈ షాకింగ్‌ ఘటన నాచారంలో శనివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటీజే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందిహైదరాబాద్‌లోని నాచారం పీఎస్ పరిధిలో పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ద్విచక్ర వాహనానికి పెట్రోల్ పోస్తుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఆకతాయిలు పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చారు. వీరిద్దరూ డేరింగ్‌కు సంబంధించి బెట్ట కాశారు. అరుణ్ వద్ద లైటర్‌ ఉండటంతో చిరన్‌ని వెలిగిస్తావా అని అడిగాడు. నీకు దమ్ముంటే వెలిగించు చూద్దాం.. అని రెచ్చగొట్టాడు. దీంతో రెచ్చిపోయిన చిరన్‌ లైటర్‌ను వెలిగించాడు. దీంతో పక్కనే పెట్రోల్‌ నింపుతున్న వాహనంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బంకు సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగిన సమయంలో అక్కడ ఓ మహిళ, మరో చిన్నారితో సహా పలువురు వ్యక్తులు ఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న నాచారం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ SK మైబెల్లీ సియాసట్ కామ్‌ నిందితులు చిరన్, అరుణ్ ఇద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిద్దరూ బీహార్‌కు చెందిన వారుగా తెలిపారు. గంజాయి మత్తులో ఉన్న యువకులు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM