దీపావళి వేళ క్రాకర్స్ కాల్చటంపై పోలీసుల ఆంక్షలు.. ఆ 2 గంటలు మాత్రమే.. ఉత్తర్వులు జారీ

byసూర్య | Sun, Oct 27, 2024, 07:09 PM

దీపావళి పండుగ అంటేనే పటాకులు పేలాల్సిందే. కాకరపుల్లలు, చిచ్చుబుడ్లు, భూచక్రాల నుంచి మొదలుపెట్టి.. థౌసెండ్ వాలాలు, లక్ష్మీబాంబులు ఇలా పేర్లు ఏవైనా.. మోత మోగిపోవాల్సిందే. ఇటు భూమి మీద పేల్చే బాంబులే కాదు.. ఆకాశానికి దూసుకెళ్లి మిరుమిట్లుగొలిపే పటాసులు కూడా పెద్ద ఎత్తున కాలుస్తుంటారు. ఎంత ఎక్కువ కాలిస్తే.. అంత ఎక్కువ పండుగను ఎంజాయ్ చేసినట్టుగా జనాలు భావిస్తుంటారు. పండుగ రోజే కాదు.. దీపావళి వస్తుందంటే నాలుగైదు రోజుల ముందు నుంచే పటాకులు పేలుతూనే ఉంటాయి. మళ్లీ కార్తీక పౌర్ణమి వరకు ఈ మోత మోగుతూనే ఉంటుంది.


అయితే.. దీపావళి వేళ హైదరాబాద్ వాసులకు పోలీసులు షాక్ ఇచ్చారు. క్రాకర్స్ కాల్చటంపై ఆక్షలు విధించారు. ఎంతో ఉత్సాహంగా పెద్ద ఎత్తున పటాకులు కాల్చాలని భావిస్తున్న వారికి పరిమితులు విధిస్తూ తాజాగా పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కువ శబ్దంతో వచ్చే బాణాసంచా కాల్చకూడదంటూ పలు మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. దీపావళి రోజున బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చకూడదని.. రహదారులపై కూడా ఎక్కువ సౌండ్లు వచ్చి క్రాకర్స్‌ని కాల్చకూడదని పోలీసులు హెచ్చరించారు.


దీపావళి పండగ రోజున.. హైదరాబాద్ నగరంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చాలని.. హైదరాబాద్ పోలీసులు పరిమితి విధించారు. కేవలం ఈ రెండు గంటల్లోనే టపాసులు కాల్చాలని.. ఆ తర్వాత ఎలాంటి బాణాసంచా కాల్చొద్దని హెచ్చరించారు. ఈ రెండు గంటల సమయంలోనూ.. భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చటంపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం.. 55 డెసిబెల్స్ మించి శబ్ధం చేసే క్రాకర్స్ కాల్చొద్దని పోలీసులు హెచ్చరించారు. నగరవాసులంతా ఈ నిబంధనలకు పాటించి.. తమకు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


మరోవైపు.. టపాసులు అమ్మే షాపు యజమానులు కూడా.. లైసెన్సు లేకుండా అమ్మొద్దని పోలీసులు హెచ్చరించారు. అనుమతులు లేకుండా.. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా టపాసులు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో జరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. చాలా మంది గ్రీన్ క్రాకర్స్‌కు మొగ్గుచూపుతున్నారు. కొందరు క్రాకర్స్‌కు దూరంగా ఉంటున్నారు. కాగా.. మోతాదుకు మించి టపాసులు పేల్చాటం వల్ల.. పర్యావరణం దెబ్బతినటమే కాకుండా.. గాలి, శబ్ధ కాలుష్యం ఏర్పడుతాయని.. మూగజీవాలు ఇబ్బంది పడుతాయని.. చాలా మంది వాదిస్తుంటారు. అసలే చలికాలం.. వాతావరణం ఇప్పుడిప్పుడే మారుతుండటంతో ఇప్పటికే చాలా మందిలో జలుబులు, జ్వరాలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ పటాకుల మోత, వాటి వల్ల వచ్చే పొగతో.. మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM