వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. ఎమ్మెల్యే

byసూర్య | Sat, Oct 26, 2024, 03:13 PM

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్, తేలుకుంట, నాగులపల్లి, చీమలపేట గ్రామాలలో అలాగే ఎలిగేడు మండల కేంద్రంలో సింగిల్ విండో, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని ఆరుగాలం కష్టపడి తన రెక్కల కష్టంతో ఎందరో ఆకలి తీర్చే అన్నదాతకు అన్యాయం జరవద్దని అన్నారు. రైతును కష్టపెట్టిన ఎ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేదని గత పాలకుల చేతిలో రైతన్నలు చాలా నష్టపోయారని తెలిపారు. గతంలో మాదిరిగా రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతులు పండించిన పంట విషయంలో ఎలాంటి కోతలు విదించకూడదని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఎమ్మెల్యే విజయరమణ రావు ఆదేశించారు.ఒకవేళ ధాన్యం కోతలు చేస్తున్నారని మా దృష్టికి వస్తే 24 గంటలకు గడవకముందే వారి బాధ్యతల నుండి తొలగించి నూతనంగా ఇతరులను చేర్చడం జరుతుందని హెచ్చరించారు.
ఈ విషయంలో ఎవరి మాటా వినబోమని స్పష్టం చేశారు. రైతులు తమకు ఎలాంటి ఇబ్బందులూ వచ్చిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఈ సీజన్ నుండే సన్న రకం పంటకు రూ. 500 బోనస్ అందించడం జరుగుతుందని అన్నారు. రైతు తన ధాన్యం అమ్మకం జరిపిన వెంటనే రెండు లేదా మూడు రోజుల్లోనే తమ పంట డబ్బులను రైతు ఖాతాలలోని జమ చేయడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జూలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గండు సంజీవ్, సింగిల్ విండో చైర్మన్లు పుల్లూరి వేణుగోపాల్ రావు,గోపు విజయ్ భాస్కర రెడ్డి, జూలపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ కొమ్మ పోశాల యాదవ్,ఎలిగేడు మండల అధ్యక్షులు సమా రాజేశ్వర్ రెడ్డి ,జూలపల్లి మండల అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు,మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు, రైతులు, హామాలీలు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM
మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి : మంత్రి సీతక్క Sat, Oct 26, 2024, 04:13 PM