రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు చేస్తున్నామన్న కేంద్రమంత్రి

byసూర్య | Thu, Oct 24, 2024, 06:37 PM

ఘట్ కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్‌తో తెలంగాణ ఎంపీల సమావేశం అనంతరం రైల్ నిలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 90 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయిందన్నారు.వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్‌ను పెంచినట్లు చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 వందే భారత్ రైళ్లను ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. మరిన్ని రైళ్లను తీసుకువస్తామన్నారు.రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులను చేస్తున్నామని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అవి పూర్తవుతాయని తెలిపారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు రూ.650 కోట్లు అవసరం అవుతాయన్నారు. ప్రస్తుతం ఘట్‌కేసర్ వరకు ఎంఎంటీఎస్ రైలు సేవలు ఉన్నాయని, దీనిని యాదాద్రి వరకు విస్తరిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సేవలను పొడిగిస్తామన్నారు


Latest News
 

కానిస్టేబుల్ భార్యపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకునే స్థాయికి దిగజార్చారని విమర్శ Thu, Oct 24, 2024, 07:27 PM
కళ్యాణలక్ష్మి,సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేత Thu, Oct 24, 2024, 07:11 PM
మెడిసిటీ ఆధ్వర్యంలో లక్ష్మాపూర్ లో ఉచిత వైద్యశిబిరం Thu, Oct 24, 2024, 07:10 PM
దేశ అభివృద్ధికి చిరునామాగా కేంద్రం పనిచేస్తుంది: ఎంపీ Thu, Oct 24, 2024, 07:09 PM
రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆకస్మికంగా తనిఖీ చేసి జిల్లా కలెక్టర్ Thu, Oct 24, 2024, 07:06 PM