రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

byసూర్య | Wed, Oct 23, 2024, 03:40 PM

దేవరకొండనియోజకవర్గం కొండమల్లేపల్లి మండలంలో  చిన్న ఆడిశర్ల పల్లి గ్రామంలో మంగళవారం పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్  ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూరైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ద్వేయం అని తెలిపారు. అన్నదాతలు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైతులను రాజు చేయడమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,దేవరకొండ మర్కెట్ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, పిఏసియస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి,కాసర్ల వేంకటేశ్వర్లు,మాజి ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్,కోట్ల జగదీష్,యువజన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కొర్ర రాంసింగ్ నాయక్,మధు,  డైరెక్టర్లు, అధికారులు రైతులుతదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM