మూసీ నిర్వాసితులకు తీపి కబురు.. ఒక్కో కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం

byసూర్య | Tue, Oct 22, 2024, 07:27 PM

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రవహించే మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకంటున్న సంగతి తెలిసిందే. మూసీ పునరుజ్జీవనం పేరుతో గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా మూసీ పరివాహకప్రాంతాల్లోని అక్రమణలను తొలగిస్తోంది. రివర్ బెడ్ ప్రాంతంలోని ఇండ్లను కూల్చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మూసీ నిర్వాహిసుతులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తోంది. ఇప్పటికే పలువురు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేశారు. రూ.25వేల చొప్పున నగదు, ఉపాధి కోసం రూ.2 లక్షల లోన్లను ప్రభుత్వం అందజేస్తోంది.


తాజాగా.. మూసీ నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. మూసీ బాధితులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు వెంట నిర్వాసితులకు ఇండ్ల జాగాలు ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తోందట. అయితే ఈ నెల 26న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ భేటీలో మూసీ నిర్వాసితులకు ఇండ్ల జాగాలు ఇచ్చే విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 చదరపు గజాల చొప్పున ప్లాట్ అందజేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆయా ప్లాట్ల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా ఉంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నారు.


మూసీ పరివాహక ప్రాతంలోని రివర్బెడ్, బఫర్ జోన్లలో ఉన్న నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఈ ఇండ్ల జాగాలను ఇవ్వాలని భావిస్తున్నారట. హైదరాబాద్ నగరం నాలుగు వైపులా ఔటర్రింగ్ రోడ్డు లోపలే వారికి ఇండ్ల జాగాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కాగా, మూసీ నిర్వాసితులు దాదాపు 13 వేలకు పైగానే ఉంటారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒక్కో కుటుంబానికి 150-200 చదరపు గజాల చొప్పున అందజేసినా మెుత్తం 600-700 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ భూములను గుర్తించాల్సిన అవసరం ఉంది.


ఇక ఒక్కో ప్లాట్ విలువ రూ.25-30 లక్షల దాకా ఉండటంతో.. నిర్వాసితులు మూసీ వీడేందుకు ముందుకు వచ్చే అవకాశముందని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈనెల ఈ నెల 26న జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.



Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM