కరెంట్ పోతే అంబులెన్స్ లు వస్తాయ్.. ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్స్ ప్రారంభం

byసూర్య | Tue, Oct 22, 2024, 07:29 PM

మనుషులకు ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర సేవల కోసం ఎమర్జెన్సీ వెహికల్స్ (అంబులెన్స్‌లు) వస్తాయన్న విషయం తెలిసిందే. పశువులకు కూడా అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి కరెంట్ పోయినా అంబులెన్స్‌లు వస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ప్రభుత్వం అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణకు విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్స్ అందుటాబులోకి తీసుకొచ్చురా. ఈ వాహనాలను సోమవారం (అక్టోబర్ 21) డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టివిక్రమార్క ప్రారంభించారు.


దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక విద్యుత్ వాహనాలు అందుటాబులోకి తీసుకొచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 57 సబ్ డివిజన్‌లకు 57 వాహనాలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్స్ సిబ్బంది అవసరమైన మెటీరియల్‌తో 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారని చెప్పారు.


ప్రతి వెహికల్‌లో ధర్మో విజన్ కెమెరాలు, పవర్ రంపము మిషన్, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్ మరియు అవసరమైన అన్ని భద్రతా పరికరాలు, సాధనాలు ఉంటాయని అన్నారు. ఇక నుంచి హైదరాబాద్ సిటీలో వర్షం పడి, చెట్టు విరిగి ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు అంబులెన్స్ తరహాలో ఈ వాహన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. సీబీడీ (సెంట్రల్ బ్రేక్ డౌన్) విభాగాన్ని పటిష్ట పర్చేందుకు ఈ విహెకల్స్ ప్రారంభించినట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు.


ఈ వెహికల్స్ ఎలా పని చేస్తాయంటే.. ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీకి అంబులెన్స్ సేవల మాదిరి విద్యుత్ ఎమర్జెన్సీకి ఈ వాహనాలు తీసుకొచ్చారు. అత్యంత వేగంగా సమస్య పరిష్కరించడానికి ఎమర్జెన్సీ వెహికల్స్ ఉపయోగపడనున్నాయి. కరెంట్ పోయినప్పుడు 1912కి డయల్ చేస్తే కంట్రోల్ రూమ్ నుంచి సంబంధిత ప్రాంత సిబ్బందికి  టీజీఎంఐఎంఎస్ యాప్ ద్వారా సమాచారం వెళ్తుంది. డివిజన్కు ఒక ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే.. వెంటనే అక్కడకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. టీజీఏఐఎమ్ఎస్ టీజీఎంఐఎంఎస్ యాప్ అత్యవసర ప్రదేశాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. ట్రాన్స్ ఫార్మర్లను లాగేంత పవర్తో ఈ వెహికల్స్‌కు ఉంటుందని విద్యుత్ అధికారులు వెల్లడించారు.



Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM