మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

byసూర్య | Tue, Oct 22, 2024, 03:54 PM

జిల్లాలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు ఒకే కుటుంబంలా కలిసి పని చేస్తూ ములుగు చిన్న జిల్లాను చింత లేని జిల్లాగా తీర్చిదిద్దాలని, జాప్యానికి తావులేకుండా అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా.అధికారులను సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర,n ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్ఎ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు మహేందర్జి. సంపత్ రావు లతో కలిసి మంత్రి ములుగు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ శాఖల అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఆయా గ్రామాల ప్రజలతో చర్చించిన అనంతరం అంచనాలను తయారుచేసి నివేదికలు, సమర్పించాలని అన్నారు. అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు: వారి పతనాన్ని మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే పనులను చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులను ప్రజలకు ఉపయోగపడే పనులను చేస్తూ సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే ప్రజల సమస్యలు తెలుసుకుంటారని పేర్కొన్నారు.


Latest News
 

గ్రేటర్‌ వాసులకు బిగ్‌ అలర్ట్ Tue, Oct 22, 2024, 05:11 PM
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి Tue, Oct 22, 2024, 04:34 PM
మూలమలుపుల్లో వాహనాలు వెళ్లాలంటే నరకమే Tue, Oct 22, 2024, 04:33 PM
షనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:31 PM
నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:23 PM