తెలంగాణకు మళ్లీ వర్ష సూచన.. 4 రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలు

byసూర్య | Mon, Oct 21, 2024, 09:53 PM

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. రానున్న 24 గంటల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఛాన్స్ ఉందని ప్రకటించారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి రేపటికి వాయుగుండంగా మారుతుందన్నారు. 23న తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని వెల్లడించారు. వాయవ్య దిశగా పయనించి 24న ఒడిశా-బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 25 వరకు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.


నేడు నిఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు కూడా ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు సైతం అధికారులు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. వర్షంతో పాటుగా గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు చెప్పారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


అల్పపీడన ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, మన్యం, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.


ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, నిర్మల్, వనపర్తి, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, మేడ్చల్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM