రేషన్ కార్డులో పేరు చేర్చులకు.... త్వరలోనే అవకాశం

byసూర్య | Mon, Oct 21, 2024, 07:24 PM

కొత్తగా పెళ్లైంది.. అయినా మెట్టినింట్లో రేషన్ కార్డులో పేరు చేర్చలేదు. పుట్టింట్లో మాత్రం రేషన్ కార్డులో పేరు తొలగించారు. దీంతో అక్కడా.. ఇక్కడా రేషన్ కార్డులో పేరు లేకపోవటంతో సరుకులు అందటం లేదు. మరో కుటుంబంలో దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. రేషన్ కార్డులో దంపతుల పేర్లు మాత్రమే ఉన్నాయి. పిల్లల పేర్లు లేకపోవటంతో రేషన్ సరుకులు అందటం లేదు.


ఇలా రేషన్‌ కార్డుల్లో అర్హుల పేర్లను చేర్చాలని తెలంగాణ వ్యాప్తంగా లక్షల కుటుంబాలు మీసేవా కేంద్రాల ద్వారా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేకపోవడంతో పౌరసరఫరాల శాఖ ఇన్నాళ్లూ ఆయా దరఖాస్తులను పరిశీలించలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11.08 లక్షల దరఖాస్తులు అందగా.. లబ్ధిదారుల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చలేదు. గత కొన్నేళ్లుగా ఈ సమస్య ప్రజల్ని ఇబ్బందులు పెడుతుండగా.. త్వరలోనే పరిష్కారం లభించనున్నట్లు పౌరసరఫరాలశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


రేషన్‌కార్డుల్లో అర్హులైన కొత్త కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు రేవంత్ సర్కార్ సానుకూలంగా ఉందని తెలిసింది. ప్రస్తుతం ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల ఫైలట్ ప్రాజెక్టు నడుస్తుండగా.. ఆ అంశం కొలిక్కి రాగానే ఈ విషయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం నిర్ణయం తర్వాత రేషన్‌ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ మొదలవుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. దాంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు కూడా అందించనున్నట్లు వెల్లడించారు.


కాగా, రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చాలంటూ లక్షల్లో దరఖాస్తులు అందాయి. వాటిని ఆమోదిస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందన్న విషయంపై ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. నెలకు సుమారు 9,890 టన్నుల బియ్యం ప్రస్తుతం ఇస్తున్న రేషన్‌కు అదనంగా కావాల్సి ఉంటుందని నివేదికలో వెల్లడంచారు. రూ.37.40 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ముందుగా ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత... ప్రస్తుత రేషన్‌ కార్డులు, అందులోని లబ్ధిదారుల సమాచారం డిజిటలైజ్ చేయనున్నారు. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు, కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.


Latest News
 

ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలని ఎంపీకి వినతి Tue, Oct 22, 2024, 04:04 PM
పలు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు.. Tue, Oct 22, 2024, 03:57 PM
మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు Tue, Oct 22, 2024, 03:54 PM
మిమ్మల్ని ఎలా తిట్టాలో కేటీఆర్‌కు శిక్షణ ఇవ్వండి అని సీఎంకు సూచిస్తానన్న జగ్గారెడ్డి Tue, Oct 22, 2024, 03:39 PM
ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థ ఎన్ఐసీకి అప్పగించిన తెలంగాణ Tue, Oct 22, 2024, 03:37 PM