పెద్దపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి పరచడమే మా ద్వేయం..

byసూర్య | Mon, Oct 21, 2024, 07:25 PM

పెద్దపల్లి పట్టణంలోని 19, 23 వార్డులో టీ.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులతో  ₹145.50  (కోటి నలభై తొమ్మిదిన్నర లక్షల రూపాయలతో) పలు సీసీ రోడ్లు, డ్రైనేజీ లు, షెడ్ మరియు కాంపొండ్ వాల్ నూతన నిర్మాణాలకు ఆదివారం రోజున స్థానిక కౌన్సిలర్లు, వార్డు ప్రజలతో కలిసి శంఖుస్థాపనలు చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.
పెద్దపల్లి పట్టణాన్ని సుందరికరమైన పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలి ఎమ్మెల్యే విజయరమణ రావు కోరారు. పెద్దపల్లి పట్టణంలోని 19 మరియు 23 వార్డులలో టీ.ఎఫ్.ఐ.డి.యు.సి నుండి ₹149.50 లక్షల నిధులతో (ఒక కోటి నలభై తొమ్మిదిన్నర లక్షల రూపాయలతో) నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని పెద్దపల్లి పట్టణంలో నూతన అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణాల నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అలాగే అధికారులు అందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. వార్డులో పర్యటించినప్పుడు మహిళా సోదరీమణులు పలు సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగిందని ఆ సమస్యలను అన్నింటినీ దశల వారీగా పరిష్కరించి తీరుతామని హామీ ఇచ్చారు. గత పాలకుల హయంలో పెద్దపల్లి పట్టణాన్ని అధ్వనమైన స్థితికి తీసుకొచ్చారని ఎక్కడ చూసినా గుంతలతో కూడిన రోడ్లను చూడడం జరుగుతుందని వాటన్నింటినీ మన ప్రజా పాలనలో సుదరికరణగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మన ప్రభుత్వ హయంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ సౌకర్యం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ ఎలాంటి సంక్షేమ పథకాలతో మహిళలకు పెద్ద పీట వేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ కౌన్సిలర్లు, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పలు వార్డుల ప్రజలు, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రైలులో సెర్వ్ చేసిన రైతాలో జెర్రి Tue, Oct 22, 2024, 01:57 PM
కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ Tue, Oct 22, 2024, 01:00 PM
నేటి దిన పత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలు Tue, Oct 22, 2024, 12:57 PM
త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ : తలసాని శ్రీనివాస్ యాదవ్ Tue, Oct 22, 2024, 12:26 PM
10 రూపాయల నాణేలు చలామణిపై అవగాహన కార్యక్రమం Tue, Oct 22, 2024, 12:09 PM