ర్యాపిడో బుక్ చేసిన ఓ యవకుడు,,,,ఊరంతా తిప్పి ఫోన్‌తో ఊడాయించిన డ్రైవర్

byసూర్య | Mon, Oct 21, 2024, 06:57 PM

ర్యాపిడో బుక్ చేసిన ఓ యవకుడు డ్రైవర్‌కు చుక్కలు చూపించాడు. ఊరంతా తిప్పి.. చివరికి డ్రైవర్ ఫోన్‌తో ఊడాయించాడు. అతడిని మాటల్లో పెట్టి చాలా తెలివిగా ఫోన్ తీసుకొని పారిపోయాడు. దీంతో ఏం చేయలో తెలియని ర్యాపిడో డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. కొండాపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న చంద్ర మహేష్ అనే యువకుడు రాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఈనెల 18న రాత్రి 11 గంటల ప్రాంతంలో నితిన్ అనే వ్యక్తి ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని డెలాయిట్ ఆఫీసు నుంచి కొండాపూర్‌లోని ఏఎంబీ మాల్ వరకు రాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. దీంతో నితిన్‌ను చంద్ర మహేష్ బైక్ ఎక్కించుకున్నాడు. నితిన్ చెప్పిన చోటుకు తీసుకెళ్లిన తర్వాత తాను డబ్బులు తీసుకురావటం మర్చిపోయానని చెప్పాడు. కూకట్‌పల్లికి తీసుకెళ్తే అక్కడ తన ఫ్రెండ్‌ను నంచి డబ్బులు తీసుకొని ఇస్తానని నమ్మించి అక్కడకు తీసుకెళ్లాడు.


అక్కడ ఓ ఇంట్లోకి వెళ్లిన నితిన్.. తన ఫ్రెండ్ లేడని చెప్పి శ్రీకృష్ణానగర్ ప్రాంతంలో విడిచిపెడితే అక్కడ అన్ని డబ్బులు కలిపి ఇస్తానని చంద్ర మహేష్‌ను నమ్మించాడు. దీంతో డ్రైవర్ చంద్ర మహేష్ నితిన్‌ను బైక్‌పై ఎక్కించుకొని శ్రీకృష్ణా నగర్ బయల్దేరాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లోని అల్కజార్ మాల్ వద్దకు చేరుకోగాని.. తన ఫోన్ స్విచ్ఛాప్ అయిందని.. చెప్పి డ్రైవర్ మహేష్ వద్ద ఫోన్ తీసుకున్నాడు. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ దూరంగా వెళ్లిన నితిన్ ఎంతకూ తిరిగి రాలేదు.


మహేష్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. తన ఫోన్‌కు మరో వ్యక్తి ఫోన్‌తో ఫోన్ చేసి చూడగా.. స్విఛ్చాప్ అని వచ్చింది. దీంతో తన ఫోన్ తీసుకొని నితిన్ పారిపోయాడని డ్రైవర్ చంద్ర మహేష్ గుర్తించాడు. ఆలస్యం చేయకుండా వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పొట్టకూటి కోసం ర్యాపిడో నడిపే యువకుడిని బురిడీ కొట్టించి ఫోన్ ఎత్తుకెళ్లిపోవటంపై మండిపడుతున్నారు. మరీ ఇలా తయారయ్యారేంట్రా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Latest News
 

ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలని ఎంపీకి వినతి Tue, Oct 22, 2024, 04:04 PM
పలు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు.. Tue, Oct 22, 2024, 03:57 PM
మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు Tue, Oct 22, 2024, 03:54 PM
మిమ్మల్ని ఎలా తిట్టాలో కేటీఆర్‌కు శిక్షణ ఇవ్వండి అని సీఎంకు సూచిస్తానన్న జగ్గారెడ్డి Tue, Oct 22, 2024, 03:39 PM
ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థ ఎన్ఐసీకి అప్పగించిన తెలంగాణ Tue, Oct 22, 2024, 03:37 PM