షవర్మా ఇష్టంగా తింటున్నారా..? అమ్మబాబోయ్, నమ్మలేని నిజాలు

byసూర్య | Mon, Oct 21, 2024, 06:54 PM

హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ..గడువు ముగిసిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా.. సికింద్రాబాద్లోని పలు షవర్మ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. శాంధార్ షవర్మ, రోల్స్ ఆన్ వీల్స్, ముజ్ తాబా గ్రిల్స్, ఆసియన్ చో, సింక్ షవర్మ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో షవర్మా సెంటర్ల నిర్వహకులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు.


 షవర్మ తయారు చేసే చోటు అపరిశుభ్రంగా ఉందని ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. షవర్మ తయారీలో ప్రమాదకర సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్లు గుర్తించారు. మాంసం, పన్నీర్ ఎలాంటి లేబుల్ లేకుండా ఉన్నాయని.. వాటిని ఎక్స్పెయిరీ డేట్ లేకుండా స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. వెజ్, నాన్వెజ్ ఐటమ్స్ ఒకే దగ్గర స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ చాలా ప్రమాదకరమని.. వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.


ఇటీవల జంట నగరాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. బేగంపేట ప్రకాశ్ నగర్‌లో 7 క్వింటాళ్ల కుళ్లిన చికెన్ను అధికారులు గుర్తించారు. బాలయ్య చికెన్ సెంటర్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చికెన్‌ను గుర్తించారు. కుళ్లిపోయిన చికెన్‌ను జనతా బార్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, మద్యం దుకాణాల సమీపంలోని పర్మిట్‌రూంలకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. కోడి కాళ్లు, తల, ఇతర భాగాలను సేకరించి బార్లు, కల్లు దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు.


ఇక కొండాపూర్ శరత్ సిటీ మాల్లోని రెస్టారెంట్లలోనూ ఫుడ్సేఫ్టీ, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చట్నీస్ రెస్టారెంట్, అల్పాహార్ టిఫిన్స్‌‌లో సోదాలు జరిపారు. చట్నీస్ రెస్టారెంట్లోని ఫుడ్ స్టొరేజీ ఏరియా, కిచెన్లో బొద్దింకలను అధికారులు గుర్తించారు. స్టోర్ రూంలో పురుగులు పట్టిన గోధుమ పిండి, రవ్వను, కుళ్లిపోయిన ఉల్లిగడ్డలు గుర్తించారు. ఫుడ్పై మూతలు లేకుండానే ఫ్రిజ్లో స్టోర్ చేసినట్లు తనిఖీల్లో తేలింది. ఈ మేరకు హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు.


Latest News
 

విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి Tue, Oct 22, 2024, 02:00 PM
రైలులో సెర్వ్ చేసిన రైతాలో జెర్రి Tue, Oct 22, 2024, 01:57 PM
కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ Tue, Oct 22, 2024, 01:00 PM
నేటి దిన పత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలు Tue, Oct 22, 2024, 12:57 PM
త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ : తలసాని శ్రీనివాస్ యాదవ్ Tue, Oct 22, 2024, 12:26 PM