రైతు భరోసా అందించాలని బిఆర్ఎస్ ధర్నా

byసూర్య | Mon, Oct 21, 2024, 05:29 PM

తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం జూలపల్లి మండల కేంద్రంలో పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేసి అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రఘువీర సింగ్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికల మేనిఫెస్టో లో తెలంగాణ రైతాంగానికి నిర్ణీత గడువులోపు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తానని, పదిహేను వేల రూపాయల రైతు భరోసా అందిస్తానని, రైతు కూలీలకు నెలవారీగా ప్రభుత్వం ద్వారా డబ్బులు చెల్లిస్తానని, అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తానని, ఎస్సారెస్పీ ద్వారా పంటలకు నిర్ణీత సమయంలో సరిపడా సాగునీరు అందిస్తానని,ఇలా అనేక రకాల అబద్ధపు హామీలతో తెలంగాణ రైతాంగాన్ని, ఓటర్లను మోసం చేసిన రేవంత్ రెడ్డి అధికారం సాధించుకున్న తర్వాత వాటిని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత వదిలేసి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ హామీలన్నీ తుంగలో తొక్కి తెలంగాణ రైతాంగాన్ని నడ్డివిరిచే కార్యక్రమం చేస్తుందని దుయ్యబట్టారు.
తదనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన చట్టబద్ధమైన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తన మేనిఫెస్టో ద్వారా హామీలు అమలు చేస్తానని ఓట్లను కొల్లగొట్టి తిరిగి మాట మార్చిన రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలని భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూసుకుంట్ల మాజీ ఎంపీపీ రమాదేవి- రాంగోపాల్ రెడ్డి, లోక రవీందర్ రెడ్డి, లాల్ మొహమ్మద్, పొలగాని సతీష్, చొప్పరి శేఖర్, కన్నం రమేష్, పూరెల్ల గంగయ్య, లక్కాకుల శ్రీనివాస్, నారగోని శంకరయ్య, ర్యాకం భాస్కర్, కత్తర్ల శ్రీనివాస్, గొడిసెల రవి, తొగరి శ్రీనివాస్, రాజేశ్వరరావు, సంకెండ్ల లక్ష్మణ్, మెండ మల్లేశం, మల్లారపు అంజి, మేర శ్రీనివాస్, గడ్డమీది శ్రీనివాస్, గుండు చంద్రమౌళి, నేరెళ్ల శ్రీనివాస్, ఇలియాస్ అంకూస్, బాణాల కొంరయ్య, ఎండి తాజోద్దీన్, గుండు సాగర్ గౌడ్, అబ్బుమియా, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM