నిజాంపేట్ లో పబ్ కల్చర్ రాకుండా చూడాలి ఆకుల సతీష్

byసూర్య | Sun, Oct 20, 2024, 08:07 PM

సమాజాన్ని చెడు మార్గం వైపు నడిపించే పబ్ కల్చర్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రాకుండా అనుమతులను రద్దు చేయాలని ఆకుల సతీష్ కోరారు. ఈ సందర్భంగా సర్వేనెంబర్ 57, బాచుపల్లి పిస్తా హౌస్ పక్కన రెసిడెన్షియల్ బిల్డింగులు కమర్షియల్ గా ఎన్వోసీ పొందకుండానే సరైన అనుమతులు లేకుండా పబ్ ప్రారంభించడం పై తక్షణమే బిల్డింగును సీజ్ చేసి, మత్తు పదార్థాలు, డ్రగ్, పబ్ కల్చర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి రాకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ మేనేజర్ కి ఫిర్యాదు చేశారు.
హెచ్ఎండీఏ నుంచి జీ+5 రెసిడెన్షియల్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని పూర్తిగా కమర్షియల్ నిర్మాణాన్ని చేపట్టి చట్టవిరుద్ధంగా బిల్డింగ్ ఎన్ఓసీ పొందకుండానే రెస్టారెంట్, పబ్ ఏర్పాటు చేశారన్నారు. భవనాన్ని సీజ్ చేసి లైసెన్స్ నీ రద్దు చేయాలన్నారు. గ్రామీణ వాతావరణం కలిగిన నిజాంపేట్ కార్పొరేషన్ లో పబ్ కల్చర్ ని తీసుకురావడం బాధాకరమన్నారు. పబ్ ని ఏర్పాటు చేయడం వలన చదువుకునే విద్యార్థులు మత్తు పదార్థాలకు డ్రగ్స్ కి బానిసలయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సిన కొందరు ప్రజాప్రతినిధులు అనుమతులు లేని పబ్ ని ప్రారంభించడం ఎంతవరకు సమంజసం  అన్నారు. తక్షణమే భవనాన్ని సీజ్ చేసి అనుమతులు రాకుండా చూడాలన్నారు.


Latest News
 

సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన Wed, Oct 23, 2024, 11:51 AM
హైదరాబాద్‌లో కుంగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ Wed, Oct 23, 2024, 11:50 AM
ఈనెల 24న ఆదిలాబాద్ కు కేటీఆర్. Wed, Oct 23, 2024, 11:34 AM
అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌. Wed, Oct 23, 2024, 11:01 AM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు Wed, Oct 23, 2024, 10:38 AM