యాదగిరిగుట్టపై భార్యతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి ఫొటోషూట్.. నెట్టింట ఆసక్తికర చర్చ

byసూర్య | Sun, Oct 20, 2024, 07:21 PM

తరచూ ఏదో ఓ వివాదంలో ఇరుక్కునే హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర గాజులు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించగా.. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో నువ్వెంత అంటే నువ్వెంతా అంటూ చేసుకున్న విమర్శలు దాడులకు దారి తీయటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత సైలెంట్ అయిన పాడి కౌశిక్ రెడ్డి.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు.


ఆదివారం (అక్టోబర్ 20న) రోజున తన సతీమణి శాలిని జన్మదినం సందర్భంగా.. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ల వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో.. తన సతీమణితో ఉన్న ఫొటోలు, వీడియోలను పంచుకున్నారు. అయితే.. ఆ ఫొటోలు, వీడియోలు.. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాగిరిగుట్టపైన తీసుకున్నవి కావటమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారగా.. వాటిపై చర్చ నడుస్తోంది.


కౌశిక్ రెడ్డి పంచుకున్న ఫొటోల్లో.. ఆలయ వీధుల్లో తన భార్యతో కలిసి ఉన్న ఫొటోలతో పాటుగా తన భార్య సింగిల్‌గా తీయించుకున్న ఫొటోలు కూడా ఉన్నాయి. ఫొటోలే కాకుండా.. వీడియోలు కూడా ఉండగా.. వాటికి మంచి మెలోడీ సాంగ్ పెట్టి రీల్స్ రూపంలో పోస్ట్ చేశారు. అయితే.. తన భార్య శాలినితో కలిసి యాదాగిరిగుట్టపైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ఆలయ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా ఫొటో షూట్ నిర్వహించుకున్నారంటూ నెట్టింట చర్చ మొదలైంది.


ఇదిలా ఉంటే.. యాదగిరిగుట్టపై చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీసుకుంటూనే ఉంటారు. ఆలయం బయట ఫొటోగ్రాఫర్లే బహిరంగంగా భక్తులను ఫొటోలు తీసి.. అప్పటికప్పుడు ప్రింట్ తీసి ఇస్తుంటారు కూడా. అయితే.. భక్తుల సెల్ ఫోన్లను కిందే డిపాజిట్ చేసుకుని.. లోపలికి పంపిస్తుండగా.. దర్శనానంతరం భక్తులు తమ ఫోన్లను తెచ్చుకుని ఆలయ శిల్పకళను తమ ఫోన్లలో బంధించుకోవటమే కాకుండా.. వాళ్లు కూడా ఫొటోలు తీసుకోవటం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం సాధారణంగా జరుగుతూనే ఉంది.


ఆలయం లోపలికి మొబైల్స్ నిషేధమన్న విషయం అందరికి తెలిసిన విషయమే కానీ.. ఆలయం బయట ఫొటోలు నిషేధం అని ఆలయ అధికారులు అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. అలాంటిది.. ఇప్పుడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీసుకున్న ఫొటోలను మాత్రం నెట్టింట వైరల్ చేస్తూ.. వాటిపై చర్చ పెట్టి వివాదంగా చిత్రీకరిస్తుండటం శోచనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Latest News
 

రైతుకు తెలియకుండానే రూ.20 లక్షల లోన్.. ఇది సరికొత్త మోసం, అకౌంట్ ఓసారి చెక్ చేసుకోండి Tue, Oct 22, 2024, 07:07 PM
మీకూ.. మీ కాంగ్రెస్ పార్టీకి ఓ దండం,,,,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి Tue, Oct 22, 2024, 07:02 PM
ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీకి అప్పగింత.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం Tue, Oct 22, 2024, 06:57 PM
కొండా సురేఖపై 100 కోట్లకు కేటీఆర్ పరువు నష్టం దావా.. 'వాళ్లందరికీ ఇదొక గుణపాఠం Tue, Oct 22, 2024, 06:53 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Tue, Oct 22, 2024, 06:48 PM