కూల్చివేతలపై 'హైడ్రా' కీలక ప్రకటన,,,ఆ నిర్మాణాల జోలికెళ్లమన్న రంగనాథ్

byసూర్య | Sun, Oct 20, 2024, 07:03 PM

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయడానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మూలాలను అస్థిరం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలు, నాలాలను కబ్జా చేసినవారికి 'హైడ్రా' ఒక భూతం లాంటిదన్నారు. వారి పట్ల ఒక హైడ్రా అంకుశంలాగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.


హైడ్రాపై కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డా్రు. హైడ్రా, మూసీ పునరుజ్జీవనం వేర్వేరు అంశాలని అన్నారు. ఇప్పటివరకు మూసీ పరిసరాల్లో కూల్చివేతలే జరగలేదని, హైడ్రా అటువైపు వెళ్ళనే లేదని అన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు తమ ఫామ్ హౌజ్‌లను కాపాడుకోడానికే పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్దమైన నిర్మాణాల జోలికి వెళ్లకుండా హైడ్రాకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు.


తాజాగా సీఎం రేవంత్ కామెంట్స్, ఆదేశాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. చట్టబద్ధమైన అనుమతులతో వెంచర్లు ఏర్పాటు చేసుకున్నవారు హైడ్రా కూల్చివేతలకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చెరువులకు సమీపంలో అనుమతులు ఉన్నా.. నిర్మాణాలు కూల్చివేస్తారని హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. చెరువులకు సమీపంలో ఉన్న నిర్మాణాలకు అన్ని అనుమతులు సక్రమంగా ఉంటే కూల్చివేయమని సీఎం చెప్పారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.


కాగా, హైడ్రా పరిధిని ఇటీవల విస్తరించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వరకు హైడ్రా పరిధిని విస్తరించారు. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిని నిర్ధారించిన తర్వాత కూల్చివేతలు చేపట్టనున్నట్లు తెలిసింది. అందుకు మరో మూడు నెలల సమయం పట్టనుండగా.. అప్పటి వరకు కూల్చివేతలు ఉండవని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ కంట్రోల్‌కు హైడ్రాను భాగస్వామ్యం చేయనున్నారు. హైడ్రా సిబ్బందిని వినియోగించుకోనున్నారు. వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ కంట్రోల్‌కు వాడుకోనున్నారు.


Latest News
 

గ్రూప్ 1 విద్యార్థులు కోరితే తాము కోర్టులో కేసు వేశామన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:26 PM
విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపే అవకాశముందన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:24 PM
బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 08:18 PM
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు Mon, Oct 21, 2024, 08:08 PM
మృతుల కుటుంబాలకు.. అండగా ముదిరాజ్ యూత్ Mon, Oct 21, 2024, 07:34 PM