మియాపూర్‌లో సంచరించింది అడవిపిల్లిగా తేల్చిన అధికారులు

byసూర్య | Sat, Oct 19, 2024, 08:57 PM

మియాపూర్‌లో చిరుత పులి సంచారం అంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. స్థానిక మెట్రో స్టేషన్‌ వద్ద చిరుత సంచరిస్తోందని శుక్రవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్‌ అయింది. దీంతో ఇవాళ ఉదయం అటవీశాఖ అధికారులు మెట్రో స్టేషన్‌ సమీపంలోని నడిగడ్డ తండా వద్దకు చేరుకుని ఆ ప్రాంతమంతా పరిశీలించారు. పాదముద్రలు గుర్తించి... ఆ ప్రాంతంలో సంచరించింది అడవి పిల్లి అని నిర్ధరించారు. ఈ ప్రాంతంలో చిరుత ఆనవాళ్లు లేవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు.


 


 


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM