ఉపాధి హామీ పనుల ప్రణాళికలు సిద్ధం చేయండి

byసూర్య | Thu, Oct 17, 2024, 03:49 PM

మండల ప్రజా పరిషత్ ఆత్మకూర్ నందు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగ పద్మజ  అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీ శ్రీనివాస రావు  గ్రామపంచాయతీ కార్యదర్శులు మరియు ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది  ఇట్టి సమావేశంలో గ్రామ పంచాయతీల వారిగా ఉపాధి హామీ పనుల ప్రగతి గురించి అలాగే గ్రామాల వారీగా జరుగుతున్న క్రొత్త పనులు గుర్తింపు ప్రక్రియపై సవివరంగా సమీక్షించడం జరిగింది. అలాగే రాబోయే సంవత్సరానికి నర్సరీ ఏర్పాటుపై సిద్ధంగా ఉండాలని వెంటనే మీ యొక్క టార్గెట్ ప్రకారం నర్సరీకి మట్టి తెప్పించుకొని బ్యాగులు నింపేందుకు సిద్ధంగా ఉండాలని తెలియజేయడం జరిగింది.
జిల్లాలో ఆత్మకూరు మండలంకు సంబంధించి ఎక్కువ ఇన్ ప్రోగ్రెస్ పనులు ఉన్నందున వెంటనే పూర్తయిన పనులు అదేవిధంగా అవసరం లేని పనులు కంప్లీట్ స్టేటస్ లోకి మార్చాలని తెలియజేశారు  శానిటేషన్ కు సంబంధించి వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, డ్రైనేజ్ అండ్ లో కమ్యూనిటీ  ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి  ఏపీవో రాజిరెడ్డి, ఈసీ రాము, టెక్నికల్ అసిస్టెంట్స్ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్స్ తదితరులు అందరూ పాల్గొన్నారు


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM