byసూర్య | Tue, Oct 15, 2024, 03:38 PM
TG: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారంలో కనిపించకుండా పోయిన 12 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ బాసరగడి గ్రామంలో.. గోనెసంచిలో బాలిక మృతదేహం కనిపించింది. సూరారంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక దసరా రోజు కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్నటి నుంచి బాలిక కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపులు చేపట్టారు. తాజాగా బాలిక మృతదేహం లభ్యమైంది.