624 కిలోల ఎండు గంజాయిని అటవీ ప్రాంతంలో నిర్వీర్యం

byసూర్య | Tue, Oct 01, 2024, 12:17 PM

ఖమ్మం కమిషనరేట్లో తొలిసారి గంజాయిని దహనం చేశారు. పొరుగునే ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టుబడిన నిషేధిత గంజాయిని పలుమార్లు ధ్వంసం చేసినా, మైదాన ప్రాంతమైన ఖమ్మంలో మాత్రం గంజాయి పట్టుబడిన సంఘటనలు చాలా తక్కువగానే ఉంటాయికాగా చాలా కాలంగా వివిధ కేసుల్లో పట్టుబడిన పెద్ద మొత్తంలో గంజాయిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నేతృత్వంలో సోమవారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేయడం తొలిసారి కావడం గమనార్హం.ఖమ్మం పోలీస్ కమిషనరేట్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 624 కిలోల ఎండు గంజాయిని అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్ పర్యవేక్షణలో పోలీస్ ఫైరింగ్ రెంజ్ మంచుకొండ అటవీ ప్రాంతంలో నిర్వీర్యం చేశారు.


ఈ గంజాయి మండుతున్నప్పుడు వెలువడే వాయువులు కూడా మానవాళికి హానికరమే కావడంతో నగర శివారు మంచుకొండ ప్రాంతానికి తీసుకెళ్లి పంచనామా అనంతరం తగులబెట్టారు. ఖమ్మం వన్ టౌన్, ఖమ్మం టూ టౌన్, ఖమ్మం త్రీ టౌన్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వేంసూరు, కల్లూరు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 7 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్థులను అరెస్టు చేసినట్లు అడిషనల్ డిసీపీ తెలిపారు.జిల్లాలోని ఠాణాల్లో నిల్వ ఉంచిన గంజాయి సరకును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్వీర్యం చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు ఉదయ్ కుమార్, రమేష్, జానర్ధన్, ఉస్మాన్ షారిఫ్ , కల్లూరు ఎస్సై ఇతర అధికారులు పాల్గొన్నారు.


 


Latest News
 

గ్రామపంచాయతీ వర్కర్స్ కు రెండో పిఆర్సి వర్తింపచేయాలి Tue, Oct 01, 2024, 02:54 PM
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం Tue, Oct 01, 2024, 02:51 PM
లగ్జరీ బస్సులో అదనంగా పది సీట్లు కేటాయించాలని వినతి Tue, Oct 01, 2024, 02:45 PM
కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణికి 131 దరఖాస్తులు Tue, Oct 01, 2024, 02:41 PM
తాత్కాలికంగా వేస్తున్న రేకుల షెడ్డు నిర్మాణ పనులను Tue, Oct 01, 2024, 02:34 PM