జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

byసూర్య | Tue, Oct 01, 2024, 02:51 PM

వికారాబాద్ జిల్లాలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో డాక్టర్ పల్వన్ కుమార్ DMHOఏప్రిల్ నుండి జిల్లాలో జరిగిన 5 మాతృ మరణాల గురించి ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ పవిత్ర మరియు డిప్యూటీ  డిఎంహెచ్వోలు,సంబంధిత వైద్యాధికారులు,సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాతృ మరణాలు అందుకు గల కారణాలను కేసువారిగా సంబంధిత వైద్యాధికారులను సమీక్షించడం జరిగినది. సిబ్బంది సేవ లోపం వల్ల గాని, అజాగ్రత్త వల్ల గాని  గర్భవతులకు లేదా బాలింతలకు ఇబ్బందులు కలగకుండా  జాగ్రత్త వహించాలని, ప్రమాదకర లక్షణాలున్న గర్భవతులను  ప్రాథమిక దశలోనే గుర్తించి తగు చికిత్సలు అందించడం వలన సాధారణ ప్రసవం జరిగే విధంగా జాగ్రత్త పడవచ్చని తెలిపారు.
అధిక ప్రమాదకర లక్షణాలున్న గర్భవతులను గుర్తించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా ప్రసవం కూడా ఉన్నతశ్రేణి ఆసుపత్రిలో జరిగే విధంగా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతి ఒక్క గర్భవతి, బాలింత మరియు పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యానికి భరోసానిచ్చేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు మరియు సిబ్బంది పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర యాదవ్, శ్రీనివాసులు డెమో పి హెచ్ సి వైద్యాధికారులు, సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు Tue, Oct 01, 2024, 04:26 PM
హైదరాబాద్ పోలీసుల నయా రూల్స్ Tue, Oct 01, 2024, 04:13 PM
జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు Tue, Oct 01, 2024, 04:12 PM
మాజీ ఎంపీపీని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే Tue, Oct 01, 2024, 04:10 PM
దసరా సెలవులు ప్రైవేట్ టీచర్స్ కి కూడా అమలు చేయాలి Tue, Oct 01, 2024, 03:58 PM