హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ గుడ్‌న్యూస్..

byసూర్య | Sat, Sep 28, 2024, 08:14 PM

టీమిండియా ఓవైపు బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. మరోవైపు ఐపీఎల్ గురించి చర్చలు జరుగుతున్నాయి.ముఖ్యంగా ఎక్కువగా రోహిత్ శర్మ హాట్ టాపిక్ గా మారుతున్నాడు. హిట్ మ్యాన్ దారి ఎటువైపు అంటూ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వారు సోషల్ మీడియాలో కథనాలు పోస్ట్ చేస్తున్నారు. గత సీజన్ కు ముందు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తీసేశారు. దీంతో అతను ప్లేయర్ గానే కొనసాగాడు. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను యాజమాన్యం తీసుకువచ్చి కెప్టెన్ ను చేసింది. జట్టు పగ్గాలు అప్పగించింది.అప్పటినుంచి రోహిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ముంబైని హిట్ మ్యాన్ వదిలీ వేయాలని కోరారు. ముంబై ఇండియన్స్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా పాండ్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా రాణించలేకపోయాడు. అయితే ప్రస్తుత ఈక్వేషన్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ ను రోహిత్ వదిలీ వేయడమా లేదా రోహిత్ శర్మనే ముంబైని వీడడం ఖాయం అంటూ చర్చలు జరుగుతున్నాయి. వేలానికి హిట్ మ్యాన్ కనుక వెళ్తే భారీ ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇప్పటికే రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. సన్రైజర్స్ లోకి హిట్ మ్యాన్ వెళ్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తపై రోహిత్ శర్మ కానీ, ఫ్రాంచైజీ కానీ ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు. కొందరు అభిమానులు మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ లోకి హిట్ మ్యాన్ రావాలని కోరుకుంటున్నారు. గతంలో హైదరాబాద్ లో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. డీసీ తరఫున మూడు సీజన్లు ఆడాడని అంటున్నారు. ఐపీఎల్ కెరియర్ ఆరంభించిన చోటుకే మళ్లీ రావాలని అంటున్నారు. తోలుత డీసీ తరఫున ఆడిన రోహిత్ శర్మ 2011లో ముంబై ఇండియన్స్ తో జతకట్టాడు. అప్పటినుంచి అదే జట్టుతో ప్రయాణం కొనసాగిస్తున్నాడు.


2013లో కెప్టెన్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ కు 5 సార్లు టైటిల్స్ ను అందించాడు. ఐదు టైటిల్స్ అందుకున్న తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. అయితే ముంబై యాజమాన్యం మాత్రం ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ హిట్ మ్యాన్ ను పక్కకు తప్పించింది. ఐపీఎల్ లో కెప్టెన్సీ పగ్గాలు వదిలేశాక టీమిండియా కెప్టెన్ గా తన రేంజ్ ఏంటో రోహిత్ శర్మ చూపించాడు. పొట్టి ఫార్మాట్ లో భారత జట్టును చాంపియన్గా నిలబెట్టాడు. జట్టును సక్సెస్ఫుల్ గా నడిపించి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ఐపీఎల్లో రోహిత్ హాట్ కేక్ గా మారబోతున్నాడు. రోహిత్ ను కొనుగోలు చేయడానికి మూడు, నాలుగు ఫ్రాంచైజీలు అయిన పోటీ పడతాయనే చర్చ ఉంది.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM