కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలన్న సీఎం

byసూర్య | Sat, Sep 28, 2024, 06:39 PM

కుటుంబ డిజిటల్ కార్డు కోసం బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి సమాచారం సేకరించవలసిన పనిలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉండేలా చూడాలన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటించి అధికారులు చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్డుల రూపకల్పలో ఆయా రాష్ట్రాలు సేక‌రించిన వివ‌రాలు, కార్డుల‌తో క‌లిగే ప్రయోజ‌నాలు, లోపాల‌ను అధికారులు వివ‌రించారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయం, ఇతర సంక్షేమ పథకాలలోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలన్నారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమాచార సేకరణ, వాటిలో ఏయే వివరాలు పొందుపర్చాలి, అప్ డేట్‌కు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా సిద్ధం చేసి మంత్రివర్గ ఉపసంఘానికి అందించాలన్నారు. ఉపసంఘం సూచనల మేరకు సమగ్ర జాబితాను సిద్ధం చేసి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలన్నారు.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM