తీన్మార్ మల్లన్నపై రెడ్డి జాగృతి ఫిర్యాదు.. ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం

byసూర్య | Sat, Sep 28, 2024, 05:54 PM

కాంగ్రెస్ ఎమెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై రెడ్డి జాగృతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెడ్డిలపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రెడ్డి జాగృతి పోలీసులకు కంఫ్లైంట్ చేయటం గమనార్హం. అయితే.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. ఒకవేళ తాను మళ్లీ ఎన్నికల్లో నిలబడితే దయచేసి.. తనకు రెడ్డివాళ్లు, ఓసీలు తనకు ఓటు వేయకండి అంటూ కామెంట్ చేశారు. కేవలం బీసీల ఓట్లే తనకు సరిపోతాయని.. అవి సరిపోగా ఇంకా కొన్ని ఓట్లు కూడా మిగులుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. తన యూట్యూబ్ ఛానెల్లో రెడ్డిలు, ఓసీలకు సంబంధించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది.


తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న రెడ్డి జాగృతి.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. ఫిర్యాదులో తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై రెడ్డి జాగృతి కీలక విషయాలను ప్రస్తావించింది. గతకొన్ని రోజులుగా.. తన య్యూట్యూబ్ ఛానెల్‌లో రెడ్డి జాతిని కించపరుస్తూ నానా దుర్భాషలాడుతున్నాడంటూ కీలక విషయాలు ప్రస్తావించింది. రాజ్యంగబద్దమైన పదవిని స్వీకరిస్తూ.. సమాజంలో ఉన్న అన్ని కులాలను, మతాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసిన తీన్మార్ మల్లన్న.. ఓసీ కులాల్లో ఉన్న పేదవాళ్లను కించపర్చటం గమనార్హమన్నారు.


ఓసీలను కించపరుస్తూ.. అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తీన్మార్ మల్లన్నకు అసలు.. ఎమ్మెల్సీగా ఉండే అర్హత లేదని.. వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని రెడ్డి జాగృతి డిమాండ్ చేశారు. అదే విధంగా.. ఓసీ కులాల్లో ఉన్న పేదవాళ్లకు బహిరంగ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో.. ఓసీలలో ఉన్న పేదవాళ్ల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న నడిపిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌ను కూడా తెలంగాణలో బ్యాన్ చేయాలంటూ రెడ్డి జాగృతి డిమాండ్ చేసింది. వెంటనే తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మరి.. రెడ్డి జాగృతి ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందించనున్నారు అన్నది చూడాలి. పోలీసులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో, పార్టీలో ఉన్న మెజార్టీ శాతం ఉన్న రెడ్డి నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా.. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల విషయంలో అవసరమైతే ఎమ్మెల్సీ పదవిని కూడా వదిలేస్తా.. కాంగ్రెస్ పార్టీని కూడా వదిలేసేందుకు సిద్ధం అంటూ పలు సంచలన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.



Latest News
 

కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM
వాళ్లందరికీ న్యాయం చేశాకే మూసీ ప్రాజెక్టుపై ముందుకెళ్తాం.. దాన కిషోర్ వివరణ Sat, Sep 28, 2024, 08:51 PM
దామగుండం ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్.. 12 లక్షల ఔషధ మొక్కలు నరికేస్తారా..? Sat, Sep 28, 2024, 08:50 PM
హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్.. అదనంగా 5 వేల మందికి ఉద్యోగాలు Sat, Sep 28, 2024, 08:47 PM
ఎదురెదురుగా ఢీకొన్న ఒకే కాలేజీ బస్సులు.. నర్సాపూర్‌లో విషాదం Sat, Sep 28, 2024, 08:46 PM