కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టాలి

byసూర్య | Tue, Sep 24, 2024, 09:57 PM

మహబూబాబాద్ జిల్లా, మండల కేంద్రం పరిధిలోని, బ్రాహ్మణపల్లి విద్యార్థులు చదువుకుంటున్న కస్తూర్భా గాంధీ గురుకుల బాలికల విద్యాలయంలో, ఎదురుగా ఉంటున్న గ్రామస్తుల వారి ఇంటి లో ఉన్న మరుగుదొడ్ల మురికి నీరు గురుకులంలోకి ప్రవహిస్తున్నది. గురుకుల ప్రహరీ గోడకు రంధ్రాన్ని ఏర్పాటు చేసి, నీరును గురుకుల పాఠశాలకు వదులుతున్న తీరు ఇక్కడి ఫోటోలో, వీడియోలో మనం చూస్తున్నాం.
విద్యార్థులకు చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలు ఆరోగ్యకరంగా ఉండేందుకు అధికారులు పడరాని తిప్పలు పడుతుంటే, వారి ఆరోగ్య పరిస్థితిలు తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత గ్రామస్తులపై ఉంది. కానీ ఇక్కడ మాత్రం యదేచ్చగా ఓ కుటుంబం వారు వాడే వాటర్, మరుగుదొడ్డి మురుగునీరు పూర్తిగా గురుకులంలోకి ధారాళంగా ప్రవహిస్తుఉంది. కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల విద్యాలయ ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేసి చూడాలి.


Latest News
 

కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం,,,సామాన్యుల కంటతడే Wed, Sep 25, 2024, 08:49 PM
జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM