త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల

byసూర్య | Wed, Sep 25, 2024, 08:44 PM

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతాలకుతలం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగింది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మూగజీవాలు వరదల్లో కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్.. పంట నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం ఇస్తామని అన్నారు. ఇలా వరదల్లో పంటని కోల్పోయిన రైతులకు తాజాగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఊరటనిచ్చే ప్రకటన చేశారు. త్వరలోనే పంట నష్టం పరిహారం బబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.


భారీ వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన ప్రతి రైతునూ తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. పంట నష్టం లెక్కించేందుకు చేపట్టిన సర్వే తుది దశకు చేరుకుందని మంత్రి వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, ఆసిఫాబాద్‌, సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుంచి పంట నష్టానికి సంబంధించిన క్షేత్రస్థాయి నివేదికలు ప్రభుత్వానికి అందాల్సి ఉందన్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో నష్టం అంచనాపై సర్కార్‌కు నివేదిక అందిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించినట్లు చెప్పారు. త్వరలోనే ఆయా అన్నదాతల ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ చేస్తామని పేర్కొన్నారు.


కాగా, ఈనెల ప్రారంభంలో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల నష్టం జరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు. ఈ మేరకు కేంద్రానికి నివేదకి అందించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం ఉందని అన్నారు. భారీ వరదల కారణంగానే రుణమాఫీ వర్తించని రైతులకు కూడా తీపి కబురు చెప్పారు. ఆయా కుటుంబ నిర్ధారణ సర్వే కాస్త ఆలస్యమైందని అన్నారు. ఇప్పటి వరకు అందిన వివరాల మేరకు రైతులకు రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేస్తున్నామన్నారు. మిగిలిన రైతులకు త్వరలోనే సర్వే నిర్వహించి వారికి కూడా న్యాయం చేయనున్నట్లు చెప్పారు.


Latest News
 

కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం,,,సామాన్యుల కంటతడే Wed, Sep 25, 2024, 08:49 PM
జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM