సింగరేణి కార్మికులకు ,,,,అక్టోబర్ 9న అకౌంట్లోకి డబ్బులు

byసూర్య | Wed, Sep 25, 2024, 08:43 PM

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పింది. బోనస్ డబ్బుల చెల్లింపుకు తేదీ ఫిక్స్ చేసింది. అక్టోబర్ 9న సింగరేణి కార్మికుల అకౌంట్లలో బోనస్ డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు సింగరేణి ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల 33 శాతం ప్రకటించింది. సింగరేణి సంస్థ 2023- 24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలలో 33 శాతం బోనస్ ఇస్తామని చెప్పారు. 2023-24 ఏడాదిలో సింగరేణికి 4,701 కోట్లు లాభం వచ్చింది. అందులో 33 శాతం అంటే మెుత్తం రూ.796 కోట్ల లాభాలు కార్మికుల వాటా బోనస్‌గా చెల్లిస్తామ‌ని ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.


ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సింగరేణి సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంల‌తో సింగ‌రేణి సీఎండీ ఎన్ బ‌ల‌రాం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దసరాకు మూడ్రోజుల ముందే అంటే అక్టోబర్ 9 కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి చరిత్రలో కార్మికులకు ఇస్తున్న అత్యధిక బోనస్ ఇదే కావటం విశేషం. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సుమారు 42 వేల మంది అధికారులు, కార్మికులకు ఈ లాభాల వాటాను పంపిణీ చేయనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికులు పనిచేసిన పని దినాల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని లాభాల వాటాను బోనస్‌గా చెల్లించనున్నారు. సగటున ఒక్కొక్క కార్మికుడి అకౌంట్‌లో సుమారుగా రూ.1.90 లక్షల చొప్పున జమ కానున్నాయి.


ఇక ఈ ఏడాది కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సింగరేణి లాభాల్లో వాటాగా కేవలం శాశ్వత కార్మికుల, ఉద్యోగులకుకు మాత్రమే బోనస్ చెల్లించేవారు. ఈసారి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రూ. 5 వేల చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకూ బోనస్‌ ఇస్తున్నామని చెప్పారు. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.


Latest News
 

కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం,,,సామాన్యుల కంటతడే Wed, Sep 25, 2024, 08:49 PM
జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM