హైదరాబాద్‌లో వర్షం కారణంగా జలమయమైన రోడ్లు

byసూర్య | Tue, Sep 24, 2024, 06:48 PM

హైదరాబాద్‌లోని పలుచోట్ల సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వర్షం కారణంగా నగరంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, అమీర్ పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.రోడ్ల పైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మాదాపూర్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి సహా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలకు సూచించారు. ఎమర్జెన్సీ కోసం 040-21111111, 90001 13667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.


Latest News
 

వారికి బ్యాంకు లోన్లు ఇవ్వొద్దు.. హైడ్రా సంచలన ఆదేశాలు Tue, Sep 24, 2024, 08:51 PM
ఓటుకు నోటు కేసు విచారణ.. సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు కీలక ఆదేశాలు Tue, Sep 24, 2024, 08:46 PM
రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని Tue, Sep 24, 2024, 08:43 PM
పట్టపగలే నడిరోడ్డుపై.. సిగ్గులేకుండా..! Tue, Sep 24, 2024, 08:39 PM
పెళ్లి పేరుతో మోసం చేశాడని..యూట్యూబర్ హర్షసాయిపై నటి ఫిర్యాదు Tue, Sep 24, 2024, 08:34 PM