మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : టిఆర్ఎస్ శ్రేణులు

byసూర్య | Mon, Sep 23, 2024, 05:39 PM

వెల్గటూర్ మండలం చెగ్యాం ముంపు గ్రామ బాధితులకు నష్టపరిహారం అందించింది బిఆర్ఎస్ హయాంలో అని చెగ్యాం మాజీ సర్పంచ్ రామిల్ల లావణ్య సనిల్ అన్నారు. ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు జరిగాయో అని బహిరంగంగా చర్చకు సిద్ధమని సవాల్ ను విసిరారు. ఆదివారం రోజున జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బిఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 40 ద్వారా ఆనాడే ముంపు ప్రాంత ప్రజలకు నష్టపరిహారం అందించామని పేరు మాది ఊరు మీది అన్నట్టు కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు విడుదల చేసిన ఇప్పటి కాంగ్రెస్ నాయకులు అన్ని సోషల్ మీడియాలో కొప్పుల ఈశ్వర్ కొంపముంచాడు ,అడ్లూరి లక్ష్మణ్ ఆదుకున్నాడు అని సోషల్ మీడియాలో వీడియో ప్రచారాలను చేయడం  సిగ్గుచేటని అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేగ్యం గ్రామంలోని 798 ఇళ్లకు 65 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి భూనిర్వాసితులను ఆదుకున్నామని తెలిపారు. చేగ్యం గ్రామంలోని 135 కుటుంబాలకు నష్టపరిహారం తక్కువ మొత్తంలో అందుతుందని, గ్రామస్థులు అప్పుడు మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ దగ్గరికి వెళ్తే 135 కుటుంబాలకు రి సర్వే నిర్వహించి అందరికీ సరైన విధంగా నష్టపరిహారం అందేలా జీవోను సాంక్షన్ చేపిచ్చింది కొప్పుల ఈశ్వర్ అని, ఇప్పుడు మీరు ఏమి పనులు చేయలేదని తప్పుడు ప్రచారాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.  2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలకు కూడా నిధులు విడుదల చేయలేని దుస్థితి ఉందని ఇప్పుడు మేము అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందని దుయ్యబట్టారు. జీవో నెంబర్ 14 ప్రకారం భూనిర్వాసితుల నష్టపరిహారంలో ఫారెస్ట్ అధికారులు నష్ట పరిహారంను తరిగించే హక్కు లేదని ఇప్పుడు మాత్రం 58 శాతం డిప్రిసియేషన్ ని ఎలా చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూనిర్వాసితులను మోసం చేసే యోచనలో ఉందని చెప్పుకొచ్చారు.  భూ నిర్వాసితులకు నష్టం జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తామని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసురుతూ మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని.... మీ ప్రభుత్వ హయాంలో చేగ్యం భూ నిర్వాసితులకు న్యాయం జరిగి ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుని రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్, సీనియర్ నాయకులు మాజీ ఎంపిటిసి మూగల సత్యం ,మాజీ సర్పంచ్ లక్ష్మీ ఎల్లయ్య , కునమళ్ళ లింగయ్య , మెరుగు అశోక్ రాజయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో త్వరలోనే మరో కొత్త రాజకీయ పార్టీ Mon, Sep 23, 2024, 08:57 PM
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు ట్రైన్లు రద్దు Mon, Sep 23, 2024, 08:52 PM
'దేవర' టికెట్ల ధరలు భారీగా పెంపు.. అదనపు షోలకూ పర్మిషన్ Mon, Sep 23, 2024, 08:49 PM
కేఏ పాల్ పిటిషన్ ఎఫెక్ట్.. ఆ 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు Mon, Sep 23, 2024, 07:52 PM
సీఎం రేవంత్ సోదరుడికి భారీ ఊరట.. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే Mon, Sep 23, 2024, 07:48 PM