కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్

byసూర్య | Mon, Sep 23, 2024, 03:09 PM

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలు ఎండబెడుతారా..? అని కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.ఒకవైపు కృష్ణా నది నిండు కుండలా ఉన్నప్పటికీ.. పంటలన్నీ ఎండిపోతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్పా పూడ్చివేతలు రావా..? అని హరీశ్‌రావు నిలదీశారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎండిపోతున్న పంట పొలాలపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.తలాపున సముద్రం ఉన్న చేప పిల్లలు నీటికి ఏడ్చినట్టు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు విమర్శించారు. ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. 22 రోజులైన కాల్వకు గండి పూడ్చడం చేతకాగ.. రైతుల పొలాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండపెడుతుందన్నారు. పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లోని రైతులు ఎన్ఎస్పీ ఆఫీసులను ముట్టడిస్తున్నారు. పార్టీలకతీతంగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం నిద్రపోతున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.


గతేడాది నీరు లేక పంటలు ఎండిపోయాయి. మరి ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేతికాని తనం వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని హరీశ్‌రావు తెలిపారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు గండి పడిన కాలువ పక్క నుంచే వెళ్తున్నారు. 22 రోజులైనా గండిపూడ్చాలని సోయిలేదా..?ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం అనే డైలాగులు కొడుతున్న రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రులకు కాల్వ గండి పూడ్చాడం చేతకాదా? అని నిలదీశారు.హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం వచ్చుగానీ.. రైతులకు నీరు ఇవ్వడం రాదా? కాంగ్రెస్‌కు రైతుల పట్ల జాలి, దయ లేదా..? అని నిలదీశారు. వరదల్లో కొట్టుకుపోయిన పంటలకు నష్టం పరిహారం ఇవ్వరా? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు కన్నీళ్లు తూడ్చడం కాదు.. కన్నీళ్లు పెట్టిస్తుంది. ఎకరాకు రూ. 25 వేలు సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వరద నష్టం వల్ల సాగర్ పరివాహక ప్రాంతాల్లో వల్ల 60 వేల ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాకం వల్ల లక్ష ఎకరాలు పోయినట్లు ప్రాథమిక అంచనాలో తేలిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ నీరు ఇచ్చినా పంటలు చేతికొచ్చే పరిస్థితులు లేవు. ఆగస్టు 15వ తేదీ ముఖ్యమంత్రి రేవంత్ ఖమ్మం జిల్లాలో సీతారామా ప్రాజెక్టు ప్రారంభించి, సీఎం, మంత్రులు డైలాగులు కొట్టిండ్రు. 70 రోజుల్లో ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్నారు. మరి సీతారామా ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న పాలేరుకు నీరు ఎందుకు ఇవ్వట్లేదు అని హరీశ్‌రావు ప్రశ్నించారు.


 


ఖమ్మం జిల్లాకు వెళ్తాం.. రైతులకు మనోధైర్యం చెబుతాం..


 


బీఆర్ఎస్ పార్టీ తరుపున మేం ఖమ్మం జిల్లాకు వెళ్తాం.. రైతులకు మనోధైర్యం చెబుతాం అని హరీశ్‌రావు తెలిపారు. దాడులకు బీఆర్ఎస్ భయపడదు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తే మాపై దాడులు చేసిండ్రు.. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. పోలీసులు అతి ఉత్సాహం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూసాం. పోలీసు అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలి ప్రభుత్వాలకు లోబడి కాదు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతో హైడ్రామా చేస్తుండ్రు. లక్షల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోతుంటే, లక్షల మంది చికెన్ గున్యా, డెంగీ వంటి విషజ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.


Latest News
 

టెండర్ ప్రక్రియ, రవాణా సేవలు, ఇతర కాంట్రాక్ట్ వ్యవహారాలపై దర్యాఫ్తు చేయాలని లేఖ Mon, Sep 23, 2024, 06:22 PM
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : టిఆర్ఎస్ శ్రేణులు Mon, Sep 23, 2024, 05:39 PM
అఖిల పక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు లో పాల్గొన్న తెల్ల హరికృష్ణ Mon, Sep 23, 2024, 05:34 PM
పీట్ల మల్లేష్ ని కలిసిన ట్రస్ట్ సభ్యులు Mon, Sep 23, 2024, 05:30 PM
వీ ఆర్ ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ లో సీబీ ఎస్ ఈ ఖో-ఖో టోర్నమెంట్స్ Mon, Sep 23, 2024, 05:27 PM