వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు

byసూర్య | Fri, Sep 20, 2024, 10:14 PM

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం (సెప్టెంబర్ 20న) రోజున సచివాలయంలో నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించి.. అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై బుల్డోజర్లను ప్రయోగిస్తూ.. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న హైడ్రాకు.. విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్దత కల్పించే అంశంపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే.. హైడ్రా కోసం 169 మంది సిబ్బందిని కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రైతులకు వడ్లపై 500 రూపాయల బోనస్ ఇచ్చే అంశంపై కూడా చర్చించిన మంత్రి వర్గం.. సానుకూల నిర్ణయం తీసుకుంది. కాగా.. ఈ ఏడాది నుంచే రైతులకు సన్న వడ్లపై రూ.500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.


ఇదిలా ఉంటే.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు వేదికలపై ప్రకటించినట్టుగా.. మూడు యూనివర్సిటీల పేర్లు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. కోటీ మహిళా విశ్వవిద్యాలయం పేరును చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా, టెక్స్‌టైల్స్ అండ్ హ్యాండ్‌లూమ్స్ యూనివర్సిటీకి కొండ లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.


ఇదే క్రమంలో ములుగు మెడికల్ కాలేజీకి 433 పోస్టుల మంజూరు చేయడంతో పాటు ఏటూరు నాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఇక.. తెలుగు యూనివర్సిటీకి మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి పేరును పెడుతూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈమేరకు.. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి.. మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.


స్వాతంత్య్రోద్యమంలో గోల్కొండ పత్రికతో ఉద్యమ స్ఫూర్తి, పోరాట జ్వాలలు రగిలించిన గొప్ప వ్యక్తి సురవరం ప్రతాప రెడ్డి అని చిన్నారెడ్డి కొనియాడారు. సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలతో అనేక పుస్తకాలు రచించారని, తన రచనలతో సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారని తెలిపారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సురవరం.. వనపర్తి నుంచి తొలి ఎమ్మెల్యేగా 1952లో ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన సురవరం పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు.



Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM