పేదరికాన్ని జయించి చదువుల తల్లి గా రాణించి చివరికి ఆగిన చిట్టితల్లి గుండె..!

byసూర్య | Fri, Sep 20, 2024, 03:42 PM

పేదరికం జయించి, చదువుల తల్లి గా రాణించి, విష జ్వరంతో 10 రోజుల పాటు పోరాడి చివరికి ఆగిన చిట్టితల్లి గుండె...కన్నీటి గాధ.. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన పగిళ్ల బ్రహ్మయ్య, నాగేంద్రమ్మ భార్య భర్తలిద్దరు గత కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వారికి కొడుకు, కూతురు, సాయి భార్గవ్(14), మహేశ్వరి(15), అయితే వీళ్ళిద్దరూ వృద్ధురాలైన నాయనమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. అమ్మానాన్న లేకపోయినా అనాధను అన్న భావనలేక, ఆత్మ ధైర్యంతో చదువుల తల్లిగా రాణిస్తూ, పేదరికన్ని జయించింది ఆ చిన్నారి. మునగాల మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మహేశ్వరి కు 10 రోజుల నుండి విష జ్వరంతో బాధపడుతుంది.
ఆదుకునే వాళ్లు ఎవరు లేక చివరకు మహేశ్వరి మృతి చెందింది. ఇలా నీ జీవితం మధ్యలోనే అర్ధాంతరంగా అనారోగ్యంతో ముగిస్తుందని ఊహించలేదని, ఎక్కడ కలిసిన ఆప్యాయతతో పిలిచే నువ్వు మా మధ్యన లేకపోవడం చాలా బాధాకరమని మునగాల గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు.సహాయం అందించి ఉంటే బ్రతికేది: పచ్చిపాల రామకృష్ణ మునగాల మండలంలో అధికారులు, వ్యాపారస్తులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు ఉన్నప్పటికీ ఆ చిట్టి తల్లి గాధ తెలిసినప్పటికీ ఎవరు సహాయం అందించడానికి ముందుకు రాకపోవడంతో ఆ చిన్నారి చిట్టితల్లి గుండె ఆగిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా ఆ కుటుంబంలో మిగిలిన సాయి భార్గవ్ ను చదువుల్లోనూ, ఆర్థికంగా, ఆదుకోవాలని మునగాల మండల ప్రజలను వేడుకున్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM