స్వచ్ఛత హి సేవ - 2024 అవగాహన కార్యక్రమం

byసూర్య | Fri, Sep 20, 2024, 03:23 PM

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నిజాంపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో స్వచ్ఛత హి సేవ - 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు తమతో పాటు ఇతరులకు రోడ్లపై చెత్త వేయకుండా ప్లాస్టిక్ కవర్లు వాడకం నిషేదించే దిశగా అవగాహనా కల్పించాలని కోరారు. తడి పొడి చెత్త వేరుచేసి, ఎప్పటికపుడ్డు పరిసర ప్రాంతాల పరిశుభ్రత, పాటించాలని సూచించారు.
మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో కలిసి స్వచ్ఛ ప్లేడ్జ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రఘునాథ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సుకృత రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్  విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ప్రార్ధబ్ సింగ్,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్ Fri, Sep 20, 2024, 07:59 PM
హైడ్రా అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమావేశం Fri, Sep 20, 2024, 07:54 PM
కల్వకుర్తిలో భారీ వర్షం Fri, Sep 20, 2024, 07:52 PM
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ Fri, Sep 20, 2024, 07:44 PM
తిరుమల లడ్డు ప్రసాదం బాధ్యులను కఠినంగా శిక్షించాలి: ఎంపీ అరుణ Fri, Sep 20, 2024, 07:41 PM