పోలీసులు తన చెయ్యి విరిగేలా కొట్టారని ఏడుస్తున్న బాధితుడు

byసూర్య | Thu, Sep 19, 2024, 07:54 PM

తనకు సంబంధం లేని విషయంలో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చేయి విరిగేలా చితకబాదారు అని జీడిమెట్లకు చెందిన వ్యక్తి ఆరోపణలు. నాలుగు రోజుల క్రితం షాపూర్ నగర్‌లోని ఓ కల్లు కాపౌండ్ వద్ద అజ్మీరా రమేశ్‌ నాయక్ (38)మద్యం సేవిస్తున్న క్రమంలో పక్కన కొందరు డబ్బుల విషయంలో గొడవ పడ్డారు. దీంతో 100కు సమాచారం ఇచ్చారు. 'గొడవ వద్దు.. ఎవరి డబ్బులు వారే తీసుకుని వెళ్లండి' అని మధ్యవర్తిగా మంచి మాటలు చెప్పిన పాపానికి ఎలాంటి సంబంధం లేని తనను స్టేషన్‌ తీసుకెళ్లి చితకబాదారాని రమేశ్‌ నాయక్‌ వాపోయారు.


కల్లు దుకాణం  దగ్గర డబ్బులు, మొబైల్ పోయాయి. అది నువ్వే తీశావ్' అంటూ పోలీసులు చితకబాదారని ఆరోపించారు. 'గొడవ వద్దని పక్కన వారికి  మంచి మాటలు చెప్పానని.. అంతకు మించి తాను ఎలాంటి దొంగతనం చేయలేదని రమేష్‌ పోలీసులను బతిమిలాడాడు.


'జరిగిన గొడవ గురించి ఏమి తెలియకుండానే నా చేయి విరిగే దాక తీవ్రంగా కొట్టి పంపించారు' అని రమేష్‌ కన్నీరు మున్నీరయ్యాడు. కూలీ చేసుకుని బతికే వాళ్లం.. పోలీసులు కొట్టిన దెబ్బలకు ఆస్పత్రికి వెళ్లే స్థోమత కూడా లేదని వాపోయాడు. డబ్బులు లేక ఇంట్లోనే ఉండిపోయానని రోదిస్తూ మాట్లాడాడు. కనీస సమాచారం తీసుకోకుండా తనను చిత్ర హింస పెట్టిన  పోలీసులపై చర్యలు తీసుకోవాలని సురేశ్‌, అతడి భార్య వేడుకుంటున్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM