పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్

byసూర్య | Thu, Sep 19, 2024, 07:51 PM

అక్టోబర్‌ వస్తుందంటే చాలు. ఆ నెలలో వచ్చే దసరా పండుగ కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. ఇక విద్యార్థులైతే దసరా సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ఏడాది తెలంగాణలో దసరా సెలవులు 13 రోజులు రానున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ అక్టోబర్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 2న గాంధీ జయంతితో సెలువులు మొదలుకానున్నాయి. ఆ తర్వాత బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వివరించారు. 


మరోవైపు కొన్ని ప్రైవేట్ పాఠశాలలైతే అక్టోబర్ 1వ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15న తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపించాయి. వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దూరంగా ఉండి చదువుకునే విద్యార్థులు ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఇదిలాఉండగా.. తెలంగాణ ప్రభుత్వం మే 25న 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్‌మస్‌ సెలవులు, అలాగే జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. 2025 ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగననున్నాయి. ఇక 2025 ఫిబ్రవరిలో పదో తరగతి ప్రీ ఫైనల్‌, మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM