వరద బాధితులకు కుమారీ ఆంటీ విరాళం.. ఎంతంటే...?

byసూర్య | Wed, Sep 18, 2024, 09:51 PM

కుమారి అంటీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేశారు. బుధవారం (సెప్టెంబర్ 18) కుమారీ ఆంటీ తన కుమార్తెతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డికి రూ.50 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కుమారీ ఆంటీని ఘనంగా సన్మానించారు. ఆమెకు శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. కాగా కొన్ని నెలల క్రితం ట్రాఫిక్ క్లియరెన్స్ లో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ను పోలీసులు తొలగించారు. దీంతో ఆమె హోటల్ బిజినెస్ బాగా దెబ్బతింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని మరీ కుమారీ ఆంటీ ఫుడ్ హోటల్ ను ఓపెన్ చేయించారు.


కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి సాయి కుమారి. హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోన్న ఆమె పేరు గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తోంది. 'మీది రూ.1000 అయింది..రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ కుమారీ ఆంటీ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరలైపోయాయి. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనం క్యూ కట్టారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తి, పోలీసులు రంగ ప్రవేశం చేసి కుమారీ ఆంటీ హోటల్ ను క్లోజ్ చేయించాల్సి వచ్చింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో మళ్లీ ఆమె బిజినెస్ ఓపెన్ అయ్యింది.


Latest News
 

రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు Fri, Sep 20, 2024, 10:48 AM
నిమజ్జన వేడుకల్లో యువకులపై దాడి Fri, Sep 20, 2024, 10:45 AM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పురోగతి Fri, Sep 20, 2024, 10:19 AM
వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM