ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రంగాళ్‌కుంట ఎఫ్‌టీఎల్‌లోని నిర్మాణాలను తొలగించాలని నోటీసులు

byసూర్య | Sat, Sep 07, 2024, 06:51 PM

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా షాకిచ్చింది. హైదరాబాద్ నగరంలోని రంగాళ్‌కుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగాళ్‌కుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొంది. హైడ్రా నోటీసులపై జయభేరి సంస్థ స్పందించాల్సి ఉంది. మరోవైపు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీరథమ్మ చెరువును పరిశీలించారు.హైదరాబాద్‌లోని పలు చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇందులో భాగంగా కొన్నిరోజుల క్రితం మాదాపూర్‌లో తుమ్మడికుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెషన్ హాలును హైడ్రా కూల్చివేసింది. దుర్గంచెరువు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లోని నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది.


Latest News
 

ఓఆర్ఆర్‌పై కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు.. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు Fri, Sep 20, 2024, 08:19 PM
పేదలకు రేవంత్ సర్కారు తీపి కబురు... పది రోజుల్లోనే విధివిధానాలు ఖరారు Fri, Sep 20, 2024, 08:17 PM
నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌తో ఇవే ప్రధాన ఎజెండా Fri, Sep 20, 2024, 08:15 PM
400 ఏళ్ల క్రితం ఔరంగజేబ్ ఇచ్చిన మాట.. 30 ఏళ్లుగా హైదరాబాదీల ఇబ్బందులు Fri, Sep 20, 2024, 08:13 PM
ఓటుకు నోటు కేసు,,,,సుప్రీంకోర్టులో సీఎం రేవంత్‌కు ఊరట Fri, Sep 20, 2024, 08:11 PM