అసెంబ్లీ లో హరీష్ రావు Vs బట్టి విక్రమార్క

byసూర్య | Sat, Jul 27, 2024, 01:23 PM

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు శనివారం వాడీవేడీగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై..ఇటు కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై ఒకరినొకరు విమర్శలతో సభను అట్టుడికించారు.అసెంబ్లీలో శనివారం హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో బెల్ట్‌ షాపులు ఎత్తేస్తామని అని అన్నారు.. ఏమైందని ప్రశ్నించారు.


బెల్ట్‌ షాపులు ఎత్తేస్తే రూ. 42 వేల కోట్లు ఆదాయం ఎలా వచ్చిందని నిలదీశారు. రూ. 7 వేల కోట్ల ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని, ఎక్సైజ్‌పై ఆదాయం పెంచి ప్రజలపై భారం వేయొద్దని అన్నారు.రూ. 31 వేల కోట్ల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పారని కానీ.. కోతలతో రూ. 31 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్లుకు తగ్గిస్తారా? . ఆరోగ్య శ్రీ రూ. 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం సంతోషమే కానీ వైద్యశాఖకు బడ్జెట్‌ తగ్గిస్తే ఇది ఎలా సాధ్యమవుతుందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్‌ ఇచ్చారు. తమ బడ్జెట్‌ చూసి హరీష్‌ రావుకు కంటగింపుగా ఉందని విమర్శించారు. మంత్రి జూపల్లి గల్లి గల్లీకి బెల్ట్‌ షాపు పెడతా అని అన్నారా? అని ప్రశించారు. హరీష్ రావు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.పదేళ్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారని అన్నారు భట్టి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిక తీసుకొచ్చారని దుయ్యబట్టారు. తాము నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇచ్చేపని మొదలు పెట్టినట్లు తెలిపారు. హారీష్‌ రావు ఎందుకు సభను తప్పుదోవ పట్టిస్తారని ప్రశ్నించారు.


Latest News
 

గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ Fri, Oct 18, 2024, 12:19 PM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి Fri, Oct 18, 2024, 12:16 PM
మూసీపై నేడు కేటీఆర్‌ ప్రజెంటేషన్‌ Fri, Oct 18, 2024, 11:57 AM
ఇద్దరు యూట్యూబర్‌లపై కేసు నమోదు Fri, Oct 18, 2024, 11:52 AM
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా నిర్ణయం Fri, Oct 18, 2024, 10:55 AM