సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

byసూర్య | Fri, Jul 26, 2024, 08:14 PM

తెలంగాణలో గత డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. ఈ ఏడాది మేలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అయితే.. ఇప్పుడు అందరి దృష్టి సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఈ నేపథ్యంలోనే.. సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో.. సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమీక్షించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌ నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్టు సమాచారం. అయితే.. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్న నేపథ్యంలో.. రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.


 కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ కు సూచించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.


గతంలోనూ.. సర్పంచ్ ఎన్నికలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. మహబూబ్ నగర్‌లో నిర్వహించిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేసి తీరుతామన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే.. సర్పంచ్ ఎన్నికలకు పోదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


ఈ నేపథ్యంలో.. రుణమాఫీని ఆగస్టు 15 లోపల పూర్తి చేసి.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సర్పంచ్‌ ఎన్నికలకు నగారా మోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో.. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే. కాగా.. త్వరలోనే సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేయటంతో.. రాష్ట్రంలో మరోసారి ఎన్నికల పండుగ షురూ కానుంది. అది కూడా తెలంగాణలో అదిపెద్ద పండుగ అయిన బతుకమ్మ, దసరా సమయంలోనే వస్తుండటంతో.. రాష్ట్రంలో సందడి వాతావరణం నెలకొననుంది.


మరోవైపు.. రుణమాఫీ చేసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు పోవాలనుకోవటంపై పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రుణమాఫీ పూర్తిచేసి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే జరిగితే.. గ్రామాల్లో ఓట్లన్ని కాంగ్రెస్‌కే పడతాయని రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్టు అంచనా వేస్తున్నారు. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM