అసెంబ్లీకి రాకుంటే జీతం తీసుకోవద్దు.. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

byసూర్య | Fri, Jul 26, 2024, 07:37 PM

తెలంగాణలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు.. ఎమ్మెల్యేలందరూ హాజరవటం లేదు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కరోజు కూడా సమావేశాలు హాజరుకాకపోగా.. నిన్న(జులై 25న) బడ్జెట్ సందర్భంగా మొదటిసారి హాజరయ్యారు. మళ్లీ రేపటి నుంచి హాజరవుతారా లేదా అన్నది ప్రశ్నార్థకమే. అయితే.. సమావేశాలకు కేసీఆర్ ఒక్కరే కాదు.. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా హాజరవటం లేదు. ఈ నేపథ్యంలో.. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ రావడంలేదని.. కొందరు ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలు.. జీతం తీసుకోవద్దని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజలంతా ఎమ్మెల్యేలను దేవుళ్లుగా భావించి.. ఏవో వరాలు కురిపిస్తారన్న ఆశతో తమను అసెంబ్లీకి పంపిస్తున్నారని వివరించారు. ప్రజలు గెలిపిస్తేనే.. ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చాయని.. ఇద్దరు గన్‌మెన్లు వచ్చారని.. ఓ ప్రొటోకాల్ వచ్చిందని.. 2 లక్షల 75 వేల జీతం వస్తుందని పేర్కొన్నారు. అలాంటప్పుడు సమావేశాలు జరుగుతుంటే.. అసెంబ్లీకి రాకపోవటం సరికాదని హితవుపలికారు. ప్రభుత్వం ఉద్యోగులకు కట్ చేసినట్టుగానే.. ఎన్ని రోజులు సమావేశాలకు రాకపోతే అన్ని రోజుల జీతం కట్ చేయాలని డిమాండ్ చేశారు.


కేసీఆర్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా సమావేశాలకు హాజరుకావట్లేదన్న ఆరోపణల పట్ల స్పందించిన కాటిపట్టి.. అది కేసీఆర్ అయినా సరే.. రాజాసింగ్ అయినా సరే.. రేవంత్ రెడ్డి అయినా సరే.. ఎమ్మెల్యే ఎవరైనా సమావేశానికి రాకపోతే ఆ రోజు జీతం తీసుకోవద్దని డిమాండ్ చేశారు. తాను కూడా అసెంబ్లీకి రాకపోతే.. ఆ రోజు జీతం తీసుకోనని.. ఆ జీతాన్ని సభకు తిరిగి ఇచ్చేస్తానిని.. ఒకవేళ తీసుకోకపోతే బయట ఎవరికైనా దానం చేస్తానని స్పష్టం చేశారు కాటిపల్లి.


మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చాలా బాధాకరంగా ఉందని కాటిపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిని ఒకరు లోపల తిట్టుకుని.. బయట కలిసి తిరుగుతున్నారని తెలిపారు. తాను జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పనిచేశానని.. సభలో ఎలా ఉండాలో తనకు తెలుసన్నారు. ఇద్దరు నాయకులు మాట్లాడితే మిగతా.. 60 మంది భజన చేస్తున్నారని.. అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడే నేతలే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి ప్రస్తావించాలనే కనీస ఆలోచన, అవగాహన ఏ నేతకు లేదన్నారు. ఎమ్మెల్యేగా అనవసరంగా గెలిచి అసెంబ్లీకి వచ్చానని తనకు బాధగా ఉందని కాటిపట్టి కీలక వ్యాఖ్యలు చేశారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM