కవితకు మరోసారి నిరాశే..

byసూర్య | Fri, Jul 26, 2024, 01:40 PM

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ ఇచ్చింది.  ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌తో సహా మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని సైతం పొడిగించింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవితను జైలు అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.సీబీఐ కేసులో డీఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్ పై జులై 22న రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.కవితపై సీబీఐ వేసిన ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేసీఆర్ మొదటి సారిగా కవిత అరెస్ట్ పై గురువారం స్పందించారు. కుట్ర చేసి తన కూతురిని అరెస్ట్ చేశారని.. దీనిపై సరైన సమయంలో స్పందిస్తా అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లి 100 రోజులు దాటిపోయింది. కొద్ది రోజుల క్రితం ఆమె స్వల్ప అస్వస్థకు గురైతే ఆస్పత్రిలో చికిత్స చేయించి జైలుకు తరలించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM